ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం..

నవతెలంగాణ – జుక్కల్

అంతర్జాతీయ  యేాగా దినోత్సవం సందర్భంగా మండలంలోని ప్రభూత్వ పాఠశాలలో యేాగా డే ను విద్యార్థులతో  కలిసి ఉపాద్యాయులు  శుక్రవారం ఘణంగా  నిర్వహించారు. ఈ సంధర్భంగా ముఖ్యఅథితిగా ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండంలోని పెద్ద ఎడ్గిలో హెచ్ ఎం తిరుపతయ్య, బస్వాపూర్  హెచ్ఎం జయచంద్,  పెద్దఎడ్గి ఎంపీపీఎస్ హచ్ఎం  చంద్రకాంత్ గౌడ్,  పలు గ్రామాలలోని పాఠశాలలో యేాగా డేను నిర్వహించారు. జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్, ఉపాదీ హమీ ఈసీ స్వామీ దాస్ , ముఖ్య అథితులుగా పాల్గోని పలు అంశాలను సూచించారు. యేాగా నిత్యం చేయడం వలన ఆరోగ్యంతో పాటు జీవిత కాలం పెరుగుతుందని, రోగాలు దరిచేరనియ్యవని, ఆరోగ్యమే మహబాగ్యమని అన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో  క్షణం సమయం లేక బీజీ జీవితాలు గడుపుతున్నారని, ఆరోగ్యం పైన శ్రద్దద పెట్టక పోవడం వలన  అనారోగ్యం పాలౌతున్నారని, ట్రెస్ కు గురౌతున్నారని తెలిపారు.  అనంతరం విద్యార్థులకు యేాగా  క్లాస్  శిక్షణ  ఇవ్వడంతో  పాటు యేాగా  చేసారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీఓ,   పాఠశాలల హెచ్ఎంలు ,  ఉపాద్యాయులు, తదితరులు పాల్గోన్నారు.
Spread the love