ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

నవతెలంగాణ – తాడ్వాయి
మండల వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించారు. మండల కేంద్రంలో, కాటాపూర్, కొడిశెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వైద్య సిబ్బంది వైద్యులు మండలంలోని అన్ని అంగన్వాడి కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఉన్న విద్యార్థులకు గురువారం ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలు ఎటువంటి హాని చేయదని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పిల్లలకు ఆల్బెండజోళ్ళు మాత్రలు వేయడం వల్ల కడుపులో పెరిగే నట్టలను పూర్తిగా నివారించే అవకాశాలు ఉంటుందన్నారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో వచ్చే రక్తహీనత పోషకాహార లోపం ఆకలి లేకపోవడం బలహీనత బరువు తగ్గడం కడుపునొప్పి ఇలాంటి వాటిని వివరించవచ్చని మండల వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు అన్నారు. మండలంలో డివార్మింగ్ డే ర్యాలీ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ లు మౌనిక, రంజిత్, సిగ్ధా, గౌతమ్, పవన్, డిపిఎమ్ఓ సంజీవరావు, ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, ప్రజాప్రతితులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love