హుస్నాబాద్ పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తాలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని గురువారం మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జవహర్ లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధాని ,భారత స్వతంత్ర పోరాటం నాయకులని అన్నారు. భారతదేశం అభివృద్ధి కోసం నూతన సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ ,కొంకటి నళిని దేవి, బోజు రమాదేవి , పున్న లావణ్య, పేరుక భాగ్యరెడ్డి ,చిత్తారి పద్మ రవి , వల్లపు రాజు, బొజ్జ హరీష్, వాల సుప్రజా నాయకులు తదితరులు పాల్గొన్నారు.