మండలంలోని వివిధ గ్రామాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా శుక్రవారం నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించి, నినాదాలు చేశారు. మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై సుదీర్ రావు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ క్రాంతి, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ షబ్బీర్, మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ లో సర్పంచ్ అశోక్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ప్రభాకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ కమిటీ సభ్యులు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.