
బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచిన మెదక్,అదిలాబాద్,నిజామబాద్ కరీంనగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి యటకారి సాయన్న ముదిరాజ్ లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి బాబు కోరారు.ప్రచారంలో భాగంగా చివరోజు మంగళవారం ఎలిగేడు,శివపల్లి,నర్సాపూర్,లాలపల్లి,సుల్తానాపూర్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పట్టపద్ర ఓటర్ల ను కలసి బీఎస్పీ అభ్యర్థులకు ఓట్లు వేసిగెలించాలని కోరారు.అనంతరం మాట్లాడారు నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి, పేదవర్గల నుండి ఎదిగిన విద్యావంతుడు,మేధావి,బహుజన బిడ్డ,తన 19సంవత్సరాల అసిస్టెంట్ ప్రొపెసర్ ఉద్యోగాన్ని వదలి నిద్యోగుల గొంతు,శాసన మండలిలో బలంగా వినిపించడానికి ముందుకు వచ్చినట్లుగా తెలిపారు.ప్రభుత్వన్నీ నిలదీసి నిరుద్యోగుల సమస్యలు పరిస్కారంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం మెరుగైన విద్యావిధానం కోసం,బడ్జెట్ కేటాయించేలా శాసనమండలిలో గళం వినిపించేందుకు నిరుద్యోగుల పక్షాన అండగా పోరాటం చేయడానికి పట్టభద్రుల ఎమ్మెస్ల్సి బరిలో ఉన్నట్లుగా తెలిపారు.విద్యను కార్పొరేట్ చేసి వ్యాపారం చేస్తూ ఆస్తులు సంపాదించుకోడానికి కొందరు ఎమ్మెల్సీగా కొందరు విద్యాసంస్థల యజమానులు పోటీ చేస్తున్నారని వారు స్వార్ధ ప్రయోజనాల పరమావధిగా భావించే వ్యక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మాజి అధ్యక్షులు గోట్టె రాజు ,పెద్దపల్లి నియెజకవర్గ అధ్యక్షులు బోంకురి దుర్గయ్య, ప్రధానకార్యదర్శి సాతురి అనిల్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు బోయిని రంజిత్,సీనియర్ నాయకులు కాంపెల్లి నంబయ్య,ఇరుగురాల సాగర్ పాల్గోన్నారు