టీజేఏసీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా హర్షవర్ధన్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (టీజేఏసీ) ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టీజేఏసీ చైర్మెన్‌ ఎం మణిపాల్‌రెడ్డి, సెక్రెటరీ జనరల్‌ పర్వతి సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షులకు ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని సమర్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందన్నారు. హర్షవర్ధన్‌రెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటిస్తే క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు ఎండీ అబ్దుల్లా, ఉమాకర్‌రెడ్డి, శ్రీవాణి, వెంకట్రావు నాయక్‌, గురుకుల ఉద్యోగుల సంఘం నాయకులు శ్రీనివాస్‌ మాలోత్‌, మోతీలాల్‌, నజీరుద్దీన్‌, రాజు జాదవ్‌, మురళీగౌద్‌, ప్రభాకర్‌, అంజయ్య, లక్ష్మణ్‌, కృష్ణయ్య, ఎం రమేష్‌, నరేందర్‌రెడ్డి, టి సత్యనారాయణ, పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love