మతిస్థిమితం కోల్పోయి..ఇంటిని వదిలి

Losing his mind..leaving the house– గుర్తించిన మహిళ పోలీస్ సౌజన్య 
– కుటుంబ సభ్యులకు చేర్చిన పోలీసులు 
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని వీరాపూర్ గ్రామానికి చెందిన జంగం అజయ్ మతిస్థిమితం కోల్పోయి గత కొద్దిరోజుల క్రితం ఇంటిని వదిలి వెళ్లాడు.మండల కేంద్రంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో కనపించడంతో మహిళ పోలీస్ సౌజన్య గమనించి వివరాలు సేకరించారు.కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.పోలీస్ స్టేషన్ అవరణంలో హెడ్ కానిస్టేబుల్ కనకయ్య,కానిస్టేబుల్ అరుణ్ సమక్షంలో  అజయ్ ను మహిళ పోలీస్ సౌజన్య కుటుంబ సభ్యులకు చేర్చారు.అజయ్ కుటుంబ సభ్యులు  మహిళ పోలీస్ సౌజన్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love