నవతెలంగాణ -పెద్దవూర
మండలంలోని పెద్దవూర, తిరుమలగిరి సాగర్ మండలాలపరిధిలోని కుంకుడు చెట్టుతండా బోనూ తల( కోనేటి పురం) గ్రామంలో వెలసిన శ్రీ తిరుమల నాథ స్వామి జాతర ప్రాంగణంలో మంగళవారం ఎంఎల్ ఏ కుందూరు జయవీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ ఛైర్మెన్ కల్లూరి వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ దండు బిక్షం ఆధ్వర్యంలో బుధవారం పెద్దవూరప్రాథమిక ఆసుపత్రి వైద్య సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో సుమారు రెండు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులకు మందులను ఉచితంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ సువర్ణ కుమారి, ఫార్మాసిస్టు, ఏఎన్ఎం విజయలక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.