ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజ్

నవతెలంగాణ – భువనగిరి
నేటి వేగవంతమైన జీవన విధానంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ జయరాజ్ కోరారు శనివారం స్థానిక జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు జయరాజ్ అదనపు సివిల్ చర్చ్ కే దశారథ రామయ్య ఆధ్వర్యంలో ఎయిమ్స్ బీబీనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో క్యాన్సర్ వ్యాధి గుర్తింపు నివారణ చికిత్స అంశంపై అవగాహన సదస్సు , రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యాక్రమములో  యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు మాట్లాడుతూ.. నేటి వేగవంతమైన జీవన విధానములో ఆరోగ్యముపై శ్రద్ద తక్కువై , అనేక రకాల వ్యాధులపై అవగాహన , జాగ్రత్త లేక ఆర్దికంగా, జీవనపరంగా నష్టపోతున్నారని తెలిపారు. నేటి వాతావరణ కాలుష్యం, ఆహార శుద్ది క్రమశిక్షణ లేకపోవటం వలన క్యాన్సర్ మరియు ఇతర వ్యాదులు అనేకంగా మనిషి జీవితాన్ని అంతం చేస్తున్నాయన్నారు. రాజ్యాంగములోని హక్కులు, సమ న్యాయం, అర్హులైన వారికి న్యాయ సహాయం అందించటానికి న్యాయ సేవ సంస్థ చట్టం రూపొందిందని తెలిపారు. దీనిలో బాగంగానే న్యాయ విజ్ఞాన సదస్సులు, న్యాయ సేవలు అందచేయటములో న్యాయ సేవ సంస్థల బాద్యత ఉంటుందని తెలిపారు. కార్యాక్రమములో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. మారుతి దేవి మాట్లాడుతూ వివిద రకాల క్యాన్సర్ వ్యాదికి గురై చాలా మంది బాదపడుతున్నారని ఈ వ్యాధిని  ముందుగా గుర్తించి తగు చర్యలు తీసుకోవటములో జాగ్రత్త వహించాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కె. దశరథ రామయ్య మాట్లాడుతూ న్యాయ సేవ సంస్థ ద్వారా జిల్లాలో చట్టాలపై అవగాహన , న్యాయ సహాయం, లోక్ అదాలత్ ల ద్వారా అధిక కేసుల పరిష్కారం చేస్తున్నట్లు తెలిపారు. కార్యాక్రమములో ఎ.ఐ.ఐ.యం.యస్, బీబీనగర్ వైధ్యులు డా. వాహిని మరియు వైద్యుల బృందం  మరియు జిల్లా వైద్యులు డా. అనిల్ మరియు వైద్య బృందం, ఆశావర్కర్లు క్యాన్సర్ కారకాలు, గుర్తింపు, చికిత్స అంశాలపై కార్యక్రమములో పాల్గొన్నవారికి పి.పి.టి. ద్వారా అవగాహన కల్పించారు. కార్యాక్రమములో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ డి.నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ జి. కవిత, భువనగిరి న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు నాగారం అంజయ్య, కార్యదర్శి సి.హెచ్. రాజశేఖర్  రెడ్డి, న్యాయవాదులు, భువనగిరి కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు. కార్యాక్రమములో న్యాయవాదులు రక్తదాన శిభిరం ద్వారా రక్త దానం చేశారు.
Spread the love