సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు భారీ భద్రత

– నిర్భయంగా ఓటేయమంటున్న పోలీసులు
– 36 పోలింగ్‌ కేంద్రాలు 32079 మంది ఓటర్లు
– ఎన్నికలకు సర్వం సిద్ధం
నవతెలంగాణ-చర్ల
భద్రాచలం ఏజెన్సీలోనే అత్యంత సమస్య ఆత్మకమైన పోలింగ్‌ కేంద్రాలుగా ఉన్న ఉంజుపల్లి, పెద్ద మిడిసి లేరు, తిప్పాపురం పోలింగ్‌ కేంద్రాలు అత్యంత సమస్య ఆత్మకమైన పోలింగ్‌ కేంద్రాలుగా అధికారులు తెలుపుతున్నారు. మండల వ్యాప్తంగా 36 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఆయా కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు 32079 ఉన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం ఓటర్లకు కావలసిన సదుపాయాలను ప్రభుత్వ అధికారులు ఇప్పటికే పూర్తి చేసి ఉన్నారు. రేగుంట, కొయ్యూరు, రామాంజపురం గ్రామాల ప్రజలు 60వ పోలింగ్‌ కేంద్రంలో సుబ్బంపేట 1, 2 గొల్లగూడెం 61 పోలింగ్‌ కేంద్రంలో సి కొత్తూరు గుట్టబోరు 62 పోలింగ్‌ కేంద్రంలో, గన్నవరం కాలనీ ఉప్పరిగూడెం సింగ సముద్రం 63 పోలింగ్‌ కేంద్రంలో, ఉంజుపల్లి, వద్దిపేట, పూసగుప్ప 64 పోలింగ్‌ కేంద్రంలో, పూజారి గూడెం కాలనీ 65వ పోలింగ్‌ కేంద్రంలో, పాత చర్ల అంబేద్కర్‌ నగర్‌ 66వ పోలింగ్‌ కేంద్రంలో జ్తులపల్లి కందిపాడు 67వ పోలింగ్‌ కేంద్రంలో రాళ్ల గూడెం, కేశవాపురం, గుంపెన గూడెం 69వ పోలింగ్‌ కేంద్రంలో, రఘు థియేటర్‌ కాలి బజార్‌ ముత్యాలమ్మ గుడి, సీఆర్‌ కాలనీ ఏరియాలో 70వ పోలింగ్‌ కేంద్రంలో, కోయికుంట గణేష్‌ నగర్‌ 1, 2 జూనియర్‌ కాలేజీ 71వ, పోలింగ్‌ కేంద్రంలో, చర్ల టౌన్‌, గొల్లకట్ట వీధి, ఆయిల్‌ బంక్‌ ఏరియా 72వ పోలింగ్‌ కేంద్రంలో, నాయకుల కాలనీ, లక్ష్మీ కాలనీ 1, 2 దేవానగరం 73వ పోలింగ్‌ కేంద్రంలో, గొంపల్లి 1, 2 74వ పోలింగ్‌ కేంద్రంలో మగలపల్లి ఆనంద కాలనీ 75వ పోలింగ్‌ కేంద్రంలో ఎంపీ పల్లి, జిపి పల్లి, సి.కత్తి గూడెం, 76వ పోలింగ్‌ కేంద్రంలో లింగాపురం 1,2,3,4 77వ పోలింగ్‌ కేంద్రంలో, కొత్తపల్లి 1,2,3 78వ పోలింగ్‌ కేంద్రంలో జంగాలపల్లి, మేడువాయి, ఎర్రగడ్డ 79వ పోలింగ్‌ కేంద్రంలో కలివేరు 1,2 నాని పల్లి కాలనీ, రజ్‌ బల్‌ కాలని 80వ పోలింగ్‌ కేంద్రంలో తేగడ కాలనీ, తేగడ 1,2,3 81వ పోలింగ్‌ కేంద్రంలో, చిన్న మిడిసి లేరు తిమ్మిరి గూడెం, బి కొత్తూరు 82వ పోలింగ్‌ కేంద్రంలో, పెద్దమించలేరు 1,2,3 83వ పోలింగ్‌ కేంద్రంలో, ఉయ్యాల మడుగు తిప్పాపురం చలమల 84వ పోలింగ్‌ కేంద్రంలో, కుర్నపల్లి ఎర్రబోరు 85వ పోలింగ్‌ కేంద్రంలో గొమ్మగూడెం, కొత్తగట్ల 86వ పోలింగ్‌ కేంద్రంలో పెద్దపల్లి 1,2 87వ పోలింగ్‌ కేంద్రంలో సత్యనారాయణపురం 1,2,3 శివలింగాపురం 28వ పోలింగ్‌ కేంద్రంలో ఆర్‌.కొత్తగూడెం 1,2 అప్పుల కొత్తగూడెం 89వ పోలింగ్‌ కేంద్రంలో, కుదునూరు 1,2,3,4 91వ పోలింగ్‌ కేంద్రంలో చింతగుప్ప బోధనెల్లి 92వ పోలింగ్‌ కేంద్రంలో మామిడిగూడెం 1,2,3 93వ పోలింగ్‌ కేంద్రంలో రాళ్ల గూడెం, పులిగుండాల 94వ పోలింగ్‌ కేంద్రంలో, శుద్ధ గుంపు దేవరపల్లి 1,2 95వ పోలింగ్‌ కేంద్రంలో ఆయా ఓటర్లు తమ తమ ఓటు హక్కును నేడు వినియోగించుకోనున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలు ఒక్కరోజు ముందు మావోయిస్టులు పసుపు ప్రాంతంలో లారీని తగలబెట్టి తమ నిరసనను తెలిపారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొదటి నుండి సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఏ.రాజు వర్మ నేతృత్వంలో భద్రత మరింత పటిష్టం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డేగ కన్నుతో పోలీస్‌ పహారా కాస్తుంది. ఓటర్లు నిర్భయంగా తమ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పోలీస్‌ ఉన్నతాధి కారులు ఫ్లాగ్‌ మార్చ్‌ ద్వారా తెలపడం పాఠకులకు విధితమే. సరిహద్దు ఛత్తీస్గడ్‌లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లో నేపథ్యంలో వేల సంఖ్యలో పోలీసులు అడవులను జల్లెడబడుతూ మావోయిస్టుల ప్రాబల్యాన్ని నియంత్రించడంలో పోలీస్‌ విజయం సాధించిందని చెప్పవచ్చు. అయితే ఏజెన్సీ అంతా కూడా నివురుగా ప్రేమింపుల ఏ క్షణాన ఏం జరుగునో అని గిరిజన పల్లెలు గడగడా వణికి పోతున్నాయి.

Spread the love