నవతెలంగాణ – హైదరాబాద్ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించిందిఅయితే, టైటిల్ గెలిచింది ఆర్సీబీనే అయినా, పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్‌లో అసలు సిసలు హీరోగా నిలిచింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల కుర్రాడు తన అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్ 2026 సీజన్‌లోని ప్రధాన వ్యక్తిగత అవార్డులన్నింటినీ కొల్లగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యంత అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శన కనబరిచాడు. వైభవ్ తో పాటు మీగతావారు ఏఏ అవార్డు గెలుచుకున్నారో తెలుకుందాం.
అవార్డుల విజేతలు
బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ పేస్ గుర్రం కగిసో రబడ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ సీజన్‌లో మొత్తం 29 వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. అతని సహచర బౌలర్ మహమ్మద్ సిరాజ్, టోర్నీలో అత్యధికంగా 172 డాట్ బాల్స్ వేసి ప్రత్యేక అవార్డును అందుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 75 ఫోర్లతో ‘మోస్ట్ ఫోర్స్’ అవార్డును దక్కించుకున్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఫీల్డర్ మనీశ్ పాండే ‘క్యాచ్ ఆఫ్ ది సీజన్’ అవార్డు గెలుచుకున్నాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో టిమ్ డేవిడ్‌ను ఔట్ చేసేందుకు గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా అందుకున్న క్యాచ్‌కు ఈ పురస్కారం లభించింది. క్రీడా స్ఫూర్తి, నైతిక ప్రవర్తనకు ఇచ్చే ‘ఫెయిర్ ప్లే అవార్డు’ను పంజాబ్ కింగ్స్ జట్టు కైవసం చేసుకుంది. పిచ్‌లు, గ్రౌండ్స్‌కు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అవార్డులు పొందాయి.
ఐపీఎల్ 2026 అవార్డుల పూర్తి జాబితా:
ఆరెంజ్ క్యాప్: వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) – 776 పరుగులు
పర్పుల్ క్యాప్: కగిసో రబడ (గుజరాత్ టైటాన్స్) – 29 వికెట్లు
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్: వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్)
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్)
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ (237.31 స్ట్రైక్ రేట్)
సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ – 72 సిక్సర్లు
మోస్ట్ ఫోర్స్: సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) – 75 ఫోర్లు
మోస్ట్ డాట్ బాల్స్: మహమ్మద్ సిరాజ్ (గుజరాత్ టైటాన్స్) – 172 డాట్ బాల్స్
క్యాచ్ ఆఫ్ ది సీజన్: మనీశ్ పాండే (కోల్‌కతా నైట్ రైడర్స్)
ఫెయిర్ ప్లే అవార్డు: పంజాబ్ కింగ్స్



