- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో యూపీఐ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు నేటి నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. తెలియని మొబైల్ నంబర్‌కు లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు చేసే సమయంలో వినియోగదారులు మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఈ కొత్త విధానం ద్వారా డబ్బు పంపే ముందు లబ్ధిదారుడి అసలు పేరు స్పష్టంగా కనిపించేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. నకిలీ క్యూఆర్ కోడ్‌ల ద్వారా జరిగే మోసాలను అరికట్టడంతో పాటు, తప్పు ఖాతాలకు డబ్బు వెళ్లకుండా రక్షణ కల్పించడం దీని లక్ష్యం.
- Advertisement -



