అందుబాటులో ఉన్నత విద్య..

– ఉన్నత శిఖరాలను అందుకోండి..
– డిగ్రీ లో చేరే విద్యార్ధులకు పిలుపు..
– ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో నూతనంగా ఏర్పాటు అయిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కావడంతో   ఉన్నత విద్య అందుబాటు లోకి వచ్చిందని, ఇంటర్ ఉత్తీర్ణత చెందిన విద్యార్ధిని విద్యార్ధులు ఈ డిగ్రీ కళాశాలలో చేరి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇంటర్ విద్యార్ధులకు పిలుపునిచ్చారు. 2023 – 24 విద్యాసంవత్సరం లో మంజూరు అయిన నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను స్థానిక జూనియర్ కళాశాలలో 2024 – 2025 విద్యాసంవత్సరం లో ఏర్పాటు చేసారు.కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ కె.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ 2024 – 2025 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలు పొందటానికి గాను కళాశాల కోర్సులు మరియు అడ్మిషన్ ఆన్లైన్ ప్రక్రియ కు సంబంధించిన ప్రచార పత్రాన్ని  ను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన నియోజక వర్గపు యువతను ఉద్దేశించి అశ్వారావుపేట పరిసర గ్రామాల విద్యార్థులు డిగ్రీ చదవడానికి సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అశ్వారావుపేట లో నూతనంగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొంది విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డాక్టర్. కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని దోస్త్ ఫేస్ వన్ మరియు ఫేస్ టు లో అడ్మిషన్లు జరిగాయని ప్రస్తుతం దోస్త్ మూడవ ఫేస్ లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ లో పాసైన విద్యార్థులు కూడా ప్రవేశం పొందవచ్చని కళాశాలలో బీఏ సిబిసిఎస్ (ఇంగ్లిష్ మీడియం – 60 సీట్లు), బీకాం కంప్యూటర్ అప్లికేషన్ ఇంగ్లిష్ మీడియం – 60 సీట్లు) బీఎస్సీ- సిబిసిఎస్ (లైఫ్ సైన్స్ 60 సీట్లు) బీఎస్సీ- సిబిసిఎస్ (ఫిజికల్ సైన్స్ – 60 సీట్లు) గ్రూపులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఇందుకుగాను ఇంటర్ పూర్తయిన విద్యార్థులు మీసేవ ద్వారా లేదా దోస్త్ యాప్ డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మరిన్ని వివరాలకు 9290081785, 9963329249 నంబర్లకు కాల్ చేసి తెలుసుకోగలరు అని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎం.రాంబాబు, పి.శ్రీనివాస్,డాక్టర్ వీరారెడ్డి, డాక్టర్ చెన్నారావు పాల్గొన్నారు.
Spread the love