Tuesday, July 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్, ఆయన బంధువుల ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మరో 10 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కిలో బంగారం, కిలోకుపైగా వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రవీందర్ పేరిట రూ.50 కోట్లకుపైగా ఆస్తులను గుర్తించారు. కొండాపూర్‌లో 2 ప్లాట్లు, మసీద్‌బండలో 4 అంతస్తుల భవనం, సుమదుర ఆక్రోపోలిస్‌లో ఫ్లాట్ తదితర ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -