
బెడ్ కవర్ హాస్పిటల్ లో అరుదైన కీ హోల్ వ్యాసికులర్ చికిత్స చేయడం జరిగిందని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రవి కిరణ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం నగరంలోని మెడికవర్ ఆసుపత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ మండలంలోని కాలూరు గ్రామానికి చెందిన అంజయ్య ( 53 సంవత్సరాలు) మరియు ఇందల్వాయి మండలం ఆసన్పల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (50 సంవత్సరాలు) ఇద్దరు వ్యక్తులు వివిధ తేదీలలో కాళ్లల్లో తీవ్రమైన నొప్పి మానని పుండు మరియు కొద్ది దూరం కూడా నడవలేని పరిస్థితులలో హాస్పటల్ కి రావడం జరిగినది. వీరిని పరీక్షించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రవి కిరణ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫేరిపెరల్ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా కాళ్ళకి సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టిoది అని నిర్ధారించి స్టంట్ వేసి రక్తప్రసరణను సాధారణ స్థితికి తీసుకురావడం జరిగినది. ఇప్పుడు పేషెంట్లు ఇరువురు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కిరణ్ మాట్లాడుతూ.. ఇటువంటి ఫెరిఫరల్ ఇంటర్వెన్షన్ చికిత్స ఎటువంటి కోత లేకుండా చిన్న రంధ్రం ద్వారా చేయటం నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మెడికవర్ హాస్పిటల్ నందు నిర్వహించడం జరిగినది ఎటువంటి కుట్టు కోత లేకుండా నిర్వహించటం జరిగినదని తెలిపారు. ఇటువంటి వ్యాధులు సాధారణంగా ధూమపానం చేయటం వలన రావచ్చని తెలిపారు. తరువాత సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ ఇటువంటి అరుదైన సర్జరీలు మెడికవర్ హాస్పిటల్ నిజాంబాద్ నందు అందుబాటులో ఉన్నవి అని తెలిపారు. వ్యాధిగ్రస్తులు హైదరాబాదు వెళ్లకుండా తక్కువ ఖర్చుతో నిజామాబాదులోనే చికిత్స పొందవచ్చు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, డి ఎం ఎస్ డాక్టర్ యజ్ఞ పాల్గొన్నారు.