
రంగుండ్ల గ్రామంలో మండల కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆంగోత్ పాండు నాయక్ ఆధ్వర్యంలో ఆదివారం హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. రంగులు చల్లుకొని స్వీట్లు పంచిపెట్టారు..ఈ సందర్భంగా మార్కెట్ డైరెక్టర్ పాండునాయక్ మాట్లాడుతూ… కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్త వర్ణ రంగుల శోభను నింపుతాయని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ హొలీ పండుగ దేశమంతటా కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో ఆంగోత్ సర్దార్ నాయక్ ,శంకర్ నాయక్ ,కిషన్ నాయక్ ,శ్రీను నాయక్ ,మహేష్ నాయక్ ,బాబురావు నాయక్ ,రవినయక్ ,లక్పతి నాయక్ , హెల్పర్ లచ్యా తదితరులు పాల్గొన్నారు.