
హొలీ ఉత్సవాల్లో భాగంగా మండలంలోని కొయ్యుర్ విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ముందస్తుగా విద్యార్థులు హొలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులను ఒక్కరినొక్కరు పూసుకుని హొలీ శుభాకాంక్షలు తెలుపుతూ అంగరంగవైభవంగా సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్స్ పాల్ సుదర్శనన్ మాట్లాడారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలికి ముందురోజు కాముని దహనం పేరుతో చలి మంటలు వేయడం ఆనవాయితీని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు