మండలంలో ఘనంగా హోలీ వేడుకలు

నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని పెద్దవూర, వెల్మ గూడెం, పులిచర్ల, ఉట్లపల్లి, కుంకుడు చెట్టు తండా, బట్టుగూడెం,అన్ని గ్రామాల్లో హోలీ సంబురాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. హోలీ పండుగ సందర్బంగా యువతీ యువకులు రంగులతో ముంచెత్తారు. యువతీ యువకులు రంగులు జల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నా రు. యువత బ్యాండ్‌ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థుల రంగులు జల్లుకొని ఆనందగా వేడుకలను ఆస్వాదించారు. వెల్మగూడెం గ్రామంలో యువకులందరూ కలిసి హోలీ సంబరాలుభారతదేశ సంస్కృతిలో భాగమైన హోలీ పండుగ సందర్భంగా అందరూ యువకులందరూ ఆనందోత్సవాలతో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాచిరెడ్డి లక్ష్మారెడ్డి,బిజెపిమండల ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల సర్వేష్,మాజి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొట్టే రామలింగయ్య, కోట శ్రీను, చిట్టిమల్ల లక్ష్మణ్, చిట్టిమల్ల శివ, కోట్ల
ఏడుకొండలు, బొడ్డుసత్యనారాయణ, కొమ్మగొని సతీష్, చిట్టిమల శివ తదితరులు పాల్గొన్నారు.

Spread the love