ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు

నవతెలంగాణ – జమ్మికుంట
ఇండియన్ మెడికల్ అసోసియేషన్( ఐఎంఏ) జమ్మికుంట, హుజరాబాద్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అంకం సుధాకర్, డాక్టర్ ఊడుగుల సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మారుతి నగర్ లో గల ఐఎంఏ ప్రాంగణంలో ఘనంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఒకరికొకరు రంగులు పూసుకొని,  హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా, ధనికా బీద తేడా లేకుండా కుల మతాలకతీతంగా జరుపుకునే వేడుక హోలీ అని వారన్నారు. ప్రపంచంలో సుఖం, దుఃఖం, సంతోషం, విచారం అనే రంగులన్నీ కలిసి చేసే కోలాహలమైన,సప్త వర్ణాల శోభితమైనదే ఈ హోళీ అని తెలిపారు.
ప్రేమ,ఆప్యాయత, ఐకమత్యం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఐఎంఏ నాయకులు డాక్టర్లు శనిగరపు తిరుపతయ్య, చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముక్క రాజేశ్వరయ్య, కిషోర్ కామిశెట్టి, పచ్చిక శ్రీకాంత్ రెడ్డి, బి రమేష్ ,వొల్లాల రాణి, ముక్క వాణి, ఊడుగుల అనిత, ముషం ప్రణీత, ముషం సురేష్, కట్కూరి దేవేందర్ రెడ్డి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love