
పంచాయతీ పాలక వర్గంను సన్మానించామని పంచాయతీ కార్యదర్శి పి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం మండలంలోని పెద్దమాసాన్ పల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గం పదవీ కాలం జనవరి 31 తో ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ 5 సంవత్స రాలు పూర్తి కావడంతో సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి, వార్డు సభ్యులను గ్రామస్థాయి అధికారుల తొ కలిసి సన్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యక ర్తలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూచి మహిపాల్ రెడ్డి, కురందరి నవీన్, మెట్టు సురేష్ తదితరులు పాల్గొన్నారు.