- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. రాయ్‌గడ్ జిల్లాలో వీకెండ్ ట్రిప్కు వెళ్లిన ఎనిమిది మంది స్నేహితులు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముంబైకి 180 కిలోమీటర్ల దూరంలోని అంబెనాలి ఘాట్ సెక్షన్‌లో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ‘అప్పీ ఆమ్చీ కలెక్టర్’ సీరియల్ నటుడు మహేష్ పవార్ (25) కూడా ఉన్నారు. ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.
- Advertisement -



