Wednesday, August 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

ఆరుగురు కూలీలు మృతి పలువురికి తీవ్ర గాయాలు
మృతులు బీదర్ జిల్లా రాజగిరికి చెందిన వ్యవసాయ కూలీలు
గుర్తింపు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సీ, ఆర్డీఓ, డీఎస్పీ


నవతెలంగాణ-జహీరాబాద్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని ఎన్‌హెచ్-65పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీ పనులు ముగించుకొని కాసేపట్లో ఇంటికి చేరుకునేలోపే ఎదురుగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతుల పరిస్థితి విషమంగా ఉండడంతో వివిద ఆస్ప్రతులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరాకుపల్లి ఎస్‌ఐ వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు సంగారెడ్డి జిల్లా బుదేరాలోని పత్తి పొలాలో కలుపు తీసేందుకు వచ్చారు. తమ పనులను ముగించుకొని సాయంత్రం కూలీలు ఆటోలో తిరుగు ప్రయాణం చేస్తున్నారు. సత్వార్ గ్రామం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ఓ ట్యాంకర్.. కూలీలతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జవగా.. ఘటనా స్థలంలోనే కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ప్రయాణిస్తున్న12 మందిలో రేష్మ (45), శ్రీదేవి (40), ఆటో డ్రైవర్ దేవదాస్(40), కవిత (40), రేఖ (38), నికిత(38) ఆరుగురు మృతి చెందారు.

మరో ఆరుగురు నిర్మల, తుల్జమ్మ, చంద్రమ్మ, శోభ, శిల్ప, రాధిక తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నాటక, సంగారెడ్డి, హైదరాబాద్‌లోని వైద్యశాలలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. కూలీలు ప్రతిరోజులాగే జహీరాబాద్ ప్రాంతానికి వ్యవసాయ పనుల కోసం వచ్చి, పనులు ముగించుకుని తిరిగి తమ స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, ఆర్డీఓ దేవుజా, డీఎస్పీ సైదానాయక్‌, తహసీల్దార్‌ ‌దశరథ, సీఐ రవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌‌ను కంట్రోల్‌ ‌చేశారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను జహీరాబాద్ కమ్యూనటీ ఆస్ప్రతిలో భద్రపరిచారు.

​మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. నాలుగు కార్లు ఒకటికి ఒకటి ఢీ కొట్టుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ ఉద్యోగి మల్లికార్జున్, మున్సిపల్ ఉద్యోగి శంకర్ అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు.

సీఎం దిగ్ర్భాంతి బాధిత కుటుంబాలకు 
ప్రగాఢ సానుభూతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వా రికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రోడ్డు ప్రమాదంపై మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు చనిపోవడం బాధా కరమని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందిం చాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, సంగారెడ్డి డీఎం హెచ్‌వోను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.




- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -