
గత కొన్ని సంవత్సరాల తుడుందెబ్బ ఆదివాసీ సంఘంల కార్యకర్త నుండి రాష్ట్రస్థాయి వరకు వివిధ పదవులలో పని చేస్తూ ఆదివాసీ సమాజానికి సేవ చేస్తూ, జాతిని చైతన్య పరిచే ప్రయత్నంలో నిమగ్నమైన విద్యానగర్ కు చెందిన గుర్రా రవిందర్ ను తుడుండెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రవిందర్ మాట్లాడారు ఈనెల 12 నుంచి 14 వరకు కొమురం బీమ విరమరణంపై జొడెన్ ఘాట్ లో నిర్వహించిన మహాసభలలో బుధవారం రాష్ట్ర కమిటీ పున నిర్మాణంలో భాగంగా ఆదివాసీ ప్రజలు తనపై నమ్మకంత మళ్ళీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్ననందుకు ఆదివాసీ ప్రజలకు కృతజ్ఞతకృతజ్ఞతలు తెలిపినట్లుగా పేర్కొన్నారు. ఆదివాసీ ప్రజ శ్రేయస్సు కోసం నిరంతరం పని చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.