పేదలకు అందుబాటులో ఇండ్ల ప్లాట్లు

నవతెలంగాణ – తిరుమలగిరి 
తాము ప్రారంభించిన రియల్ ఎస్టేట్ వెంచర్ లో నిరుపేదలకు అందుబాటులో ఉండే ధరలలో ఇండ్ల ప్లాట్లను విక్రయిస్తున్నామని, నాగారం  మండలం పనిగిరి గ్రామ సమీపంలో ఏర్పాటుచేసిన బుద్ధనగర్ రియల్ ఎస్టేట్ వెంచర్ను ఆదివారం నాడు ఆ గ్రామ మాజీ సర్పంచ్ గట్టు నరసింహారావు బీఆర్ఎస్ నాయకులు కళ్ళెట్లపల్లి ఉప్పలయ్య, శోభన్ బాబు ప్రారంభించి ప్రసంగించారు. ఫణిగిరి గ్రామ సమీపంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుద్ధ వనం పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ను ప్రారంభించడం తమ గ్రామ అభివృద్ధికి శుభసంకేతమని అన్నారు. జనగాం సూర్యాపేట హైవే పక్కన ఉన్న ఈ వెంచర్ లో అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను నిర్ణయించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధ నగర్ మేనేజింగ్ డైరెక్టర్స్ మోడం చంద్రమౌళి, గుండ్ల స్కైలాబ్, శివప్రసాద్, శంకర్ సత్యనారాయణ, చెవిటి సూర్య యాదవ్, చెవిటి నరసయ్య, సంపత్ కుమార్ తో పాటు బాకీ శీను, పాలబిందెల మహేష్ కట్లెట్లపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love