సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. విచారణ వాయిదా

నవతెలంగాణ -ఢిల్లీ: విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని ఇటీవల ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏప్రిల్‌ 24లోగా తమ స్పందన తెలియజేయాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. దీనిపై ఏప్రిల్‌ 29 తర్వాత విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది.

Spread the love