
– ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబం వినతి
నవ తెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో కరెంట్ బోర్డు షాట్ సర్క్యూటై ఇంట్లో సామాగ్రికి అంటుకొని రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిన సంఘటన మండలంలోని ఇప్పులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కేశారం పల్లిలో చోటు చేసుకుంది. ఇంటి యజమాని పోచంపల్లి మల్లయ్య పూర్తి కథనం ప్రకారం ఆదివారం మధ్యాహ్న సమయంలో తన ఇంట్లో ఉన్న విద్యుత్ బోర్డు నుంచి ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూటై ప్రక్కనున్న బట్టలకు, బ్యాగులకు మంటలు అంటుకొని కాలిపోయునట్లుగా కన్నీరుమున్నీరైయ్యాడు. బట్టల్లో రూ.15 వేలు నగదు,బ్యాగుల్లో ఉన్న విలువైన బట్టలు,కరెంట్ తీగలు,ఇంటి పై రేకులు ధ్వంసం కావడంతో రూ.50 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.