డయాబెసిటి ఎలా పెరుగుతోంది..

నవతెలంగాణ-హైదరాబాద్ : కొవిడ్-తరువాతి కాలంలో ‘డయాబెసిటి’ అనే ఒక ఆందోళనకరమైన స్థితి ఉత్పన్నం కావడంతో ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ గణనీయమైన మార్పులను సూచించింది. వైద్య సంఘాలు రూపొందించిన ఈ పదము డయాబెటిస్ మరియు ఒబేసీటిల కలయిక. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇంకా ఈ మహమ్మారి దీర్ఘ-కాలిక ప్రభావాలతో పోరాడుతూ ఉన్న నెపథ్యములో, పెరుగుతున్న ఈ ఆరోగ్య సమస్యను వెలుగులోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల ఆరోగ్యం పై ప్రభావాల నివారణ, నిర్వహణ మరియు మంచి వైద్యం కోసం మధుమేహం మరియు ఊబకాయం యొక్క కలయికను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
కొవిడ్-19 మహమ్మారి ఇప్పటికే ఉన్న మధుమేహం మరియు ఊబకాయం యొక్క ప్రమాదాలను మరింత ఎక్కువ చేసింది, ఇది డయాబెసిటి ఆవిర్భావానికి దారి తీసింది. నెలల కాలం సాగిన లాక్ డౌన్ లు, నిశ్చలమైన జీవన శైలులు,  దైనందిన పనులలో అవాంతరాలు అన్నీ బరువు పెరగటానికి మరియు శారీరిక పనులు తగ్గటానికి కారణమయ్యాయి. కోవిడ్ బారిన పడటం, చికిత్సలు, మారిన జీవన శైలుల కారణంగా మహమ్మారి తరువాత మధుమేహ రోగుల సంఖ్య పెరిగింది. మహమ్మారి సమయములో ఒత్తిడి, ఆందోళన మరియు భోజన పధ్ధతులలో మార్పులు ఈ ఆనారోగ్య పరిస్థితికి మూలం అయ్యాయి, ఇది ఇప్పుడు పెద్ద ఆరోగ్య సమస్య అయ్యింది. డయాబెసిటి అనేక సంక్లిష్టతలు మరియు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి ఆది ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది.
ఊబకాయం, మధుమేహం రెండు వేరువేరుగా గుండె జబ్బులు, కాలేయ వైఫల్యం, మూత్రపిండాల సమస్యలు మరియు నరాల సంబంధ సమస్యలు కలిగిస్తాయి. ఇవి రెండూ కలిసినప్పుడు అవి ప్రమాదకరమైన పరిస్థితి కలిగిస్తాయు, తద్వారా కోవిడ్-19 యొక్క కొత్త వెరియంట్ లేదా ప్రస్తుతం ఉన్న వెరియంట్స్, తో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం , అనేక శారీరక సమస్యలు మరియు మొత్తం ఆరోగ్య స్థితి విషమించే అవకాశం ఉంటుంది. ముంచుకొస్తున్న డయాబెసిటి విపత్తును పరిష్కరించడం కోసం ఆరోగ్య వృత్తి నిపుణులు, పాలసీమేకర్స్ మరియు ఆరోగ్య సంఘాలు, దీని నివారణ మరియు నిర్వహణ వ్యూహాలతో కలిసి ముందుకు రావాలి. విద్య, జీవనశైలి మార్పులు మరియు అందుబాటులో ఉండే ఆరోగ్యసంరక్షణ సేవలతో ఒక బహుముఖ విధానము అవసరం ఉంది. ముందుగా, ప్రజలు మధుమేహం, ఊబకాయం,  మొత్తం ఆరోగ్యం మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోనుటకు అవగాహన మరియు విద్యా ప్రచారాలు కావాలి.
ఈ ప్రచారాలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, క్రమమైన వ్యాయామం మరియు ఒత్తిడి తగ్గించుకునే టెక్నిక్ లు ప్రొత్సహిస్తాయి. అలాగే ప్రజలు తమ ఆరోగ్య స్థితిని పర్యవేక్షించేందుకు క్రమం తప్పకుండా వైద్య చెకప్ లు చేయించుకోవడాన్ని కూడా ప్రోత్సహిస్టాయి. అంతేకాకుండా, వ్యక్తులు తమ జీవనశైలి మార్పులు చేసుకోవడంలో సహకరించడం చాలా ముఖ్యం. పోషణ సంబంధ కౌన్సిలింగ్ వంటి వనరులు అందించడం, వ్యాయామ కార్యక్రమాలు మరియు కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్స్ ప్రజలు ఆరోగ్యకరమైన అలవాట్లు అవలంబించుటకు తోడ్పడతాయి.
ఆరోగ్య సంరక్షకులు, ఉద్యోగ యజమానులు మరియు బీమా సంస్థల మధ్య సహకారం, పనిప్రదేశ సంరక్షణ కార్యక్రమాలు మరియు ఆరోగ్యకరమైన-జీవన ఎంపికలను సానుకూలపరచగలరు. దీనికి తోడు, అందుబాటు ధరలలో నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడం కీలకం. ఇందులో డయాబెసిటి యొక్క నివారణ మరియు నిర్వహణ గురించి వైద్య నిపుణులకు శిక్షణ ఇవ్వడం, రోగ నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు, మరియు ప్రభావిత వ్యక్తులకు ప్రత్యేక సంరక్షణ అందించడం వంటివి ఉంటాయి. ప్రపంచము కోవిడ్-తరువాతి కాలములో ప్రయాణిస్తున్న తరుణంలో, డయాబెసిటి యొక్క నివారణ మరియు నిర్వహణలను ప్రాధాన్యీకరించడం తప్పనిసరి. ఊబకాయం మరియు మధుమేహాలకు కారణాలను పరిష్కరించడం ద్వారా మనము ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారాన్ని తగ్గించడం మరియు మొత్తం సంక్షేమాన్ని మెరుగుపరచడం కొరకు పనిచేయవచ్చు..
– డా. దీప్తి కొండగారి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజస్ట్,
ఎండోర్యూమాకేర్ హైదరాబాద్

Spread the love