గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్ : ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో రికార్డు మెజారిటీతో సీట్లు గెలుచుకుని వరుసగా ఏడవ సారి బీజేపీ అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు.
60 ఏళ్ల భూపేంద్ర పటేల్ గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

 

Spread the love