
ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓర్సు రాములు,బాల్కొండ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రేస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఏర్గట్ల గ్రామానికి చెందిన కురాకుల ముదిరాజ్ సంఘం, ముదిరాజ్ బర్మ పెద్ద సంఘం,వడ్డెర సంఘాల సభ్యులు సుమారు 100 మంది శనివారం పార్టీలో చేరారు. వారికి ముత్యాల సునీల్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని సునీల్ రెడ్డి వారిని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండలాధ్యక్షులు సోమ దేవరెడ్డి, జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్,కిసాన్ ఖేత్ మండలాధ్యక్షులు ముస్కు మోహన్ రెడ్డి,నాయకులు రేండ్ల రాజారెడ్డి, కల్లెడ పురుషోత్తం, బద్దం లింగారెడ్డి,తదితరులు పాల్గొన్నరు.