గ్యాస్‌ సబ్సిడీకి భారీ కోత

గ్యాస్‌ సబ్సిడీకి భారీ కోత– ప్రజలపై అధిక భారం
– ఐదేండ్లలో రూ.30,244 కోట్ల సబ్సిడీ పాయే
– రూ.37,209 కోట్ల నుంచి రూ.6,965 కోట్లకు తగ్గుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ సర్కార్‌ గ్యాస్‌ సబ్సిడీకి భారీగా కోత విధించింది. ఐదేండ్లలో రూ.30,244 కోట్లు కోత పెట్టింది. దీంతో దేశంలోని సామాన్య ప్రజలకు ఇది తీవ్ర భారంగా మారింది. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ వి. శివదాసన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018-19లో రూ.37,209 కోట్లుగా ఉన్న గ్యాస్‌ సబ్సిడీ 2022-23 నాటికి రూ.6,965 కోట్లకు తగ్గింది.
సంవత్సరం సబ్సిడీ (రూ. కోట్లల్లో)
2018-19 రూ.37,209
2019-20 రూ.24,172
2020-21 రూ.11,896
2021-22 రూ.1,811
2022-23 రూ.6,965
పెట్రోలియం పీఎస్‌యూల్లో ఖాళీలు
పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల్లో 2,920 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీ అన్నారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 డిసెంబర్‌ 5 నాటికి పెట్రోలియం పీఎస్‌యూల్లో 2,920 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

Spread the love