బెల్ట్ షాపులను నిషేధించాలని కొరటికల్  లో భారీ ర్యాలీ

కొరటికల్ లో రాజగోపాల్ రెడ్డికి మహిళలు పాలాభిషేకం…
బెల్ట్ షాప్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై , పీఏసీఎస్ చైర్మన్
నవతెలంగాణ – మునుగోడు
గ్రామాలలో గల్లి గల్లీలో బెల్ట్ షాప్ ఉండడంతో రాత్రి పగలు తేడా లేకుండా యువత మత్తులో ఉండి యువకులు అనారోగ్య పాలవడంతోపాటు రోడ్డు ప్రమాదాలకు గురై అర్ధాంతరంగా యువత కుటుంబాలకు దూరమవుతున్న సంఘటనలు చూసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెల్లించి పోయి తమ నియోజకవర్గ పరిధిలో బెల్ట్ షాపుల ను నిషేధించాలని అధికారులకు ఆదేశించడంతో ఎమ్మెల్యే నిర్ణయాన్ని కి గురువారం మండలంలోని కొరటికల్ గ్రామంలో మహిళలు గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే కు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా మునుగోడు ఎస్సై వెంకటేశ్వర్లు , డిసిసిబి డైరెక్టర్ మునుగోడు పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో పాల్గొని బెల్ట్ షాపుల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి  గ్రామాలలో బెల్ట్ షాపుల నిషేధం విధించడం వల్ల నియోజవర్గంలో ప్రతి గ్రామంలో  ప్రశాంతమైన వాతావరణం నెలకొననుందని అన్నారు. ఎమ్మెల్యే నిర్ణయాన్ని అమలు చేసే విధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు , కొంపెల్లి సర్పంచ్ జాల ఎంకన్న యాదవ్ , కొరటికల్ గ్రామ శాఖ అధ్యక్షులు దండు లింగస్వామి , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నక్క వెంకన్న యాదవ్, సత్తయ్య తదితరులు ఉన్నారు.
Spread the love