అబ్బుర‌ప‌రిచిన‌ హైదరాబాద్‌ జిందాబాద్‌

Dazzled Hyderabad Zindabadహైదరాబాద్‌ నగరం ఒక మినీ భారత్‌. ఈ నగరం అన్ని రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళనం. అది హైదరాబాద్‌ ప్రత్యేకత. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సగర్వంగా చాటేలా హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కల్చరల్‌ ఫెస్టివల్స్‌లను నిర్వహిస్తుంది.
ప్రముఖ డాక్టర్లు, సామాజిక పర్యావరణ వేత్తల నేతృత్వంలో, సేవా దక్పథంతో హైదరాబాద్‌ జిందాబాద్‌ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్‌ను నివాసయోగ్యంగా, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్యం కాపాడుటమే లక్ష్యంగా హైదరాబాద్‌ జిందాబాద్‌ కృషి చేస్తున్నది. 2015 నవంబర్‌లో ఏర్పాటైన ఈ సంస్థ 2016 నుంచి బీపీ, షుగర్‌ ఉచిత మెడికల్‌ శిబిరాన్ని నిర్వహిస్తున్నది. ఈ కొనసాగింపుగా మెగా మెడికల్‌ క్యాంపులను హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. వైద్య శిబిరాల్లో పాల్గొంటున్న డాక్టర్లు, సుమారు 30 మంది కార్యకర్తలు అంకితభావంతో ఉచిత సేవలందిస్తున్నారు. ఈ బీపీ, షుగర్‌ మెడికల్‌ క్యాంపు జనవరి 2025 నాటికి వంద నెలలు పూర్తిచేసుకున్నది. ఈ సందర్భంగా 2025 మార్చి 2న విజయోత్సవ సభను నిర్వహించనున్నది. ఆ స్ఫూర్తితో మరిన్ని మెగా మెడికల్‌ క్యాంపులను వివిధ మురికివాడల్లో నిర్వహించాలని ప్రణాళికను రూపొందించుకున్నది.
హైదరాబాద్‌ నగరాన్ని నివాసయోగ్య నగరంగా మార్చాలనే లక్ష్యంతో అంటే, కాలుష్య రహితంగా, పర్యావరణ హితంగా నగరం అభివృద్ధి కావాలని హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆకాంక్షిస్తున్నది. అందులో భాగంగా పర్యావరణ ప్రాధాన్యత సమాచారంతో కూడిన 120 చార్టులతో ఎగ్జిబిషన్‌ను రూపొందించారు. ఈ ఎగ్జిబిషన్‌ను అనేక విద్యా సంస్థలు, ముఖ్యమైన సమావేశాల సందర్భంగా ప్రదర్శిస్తూ నగర ప్రజానీకంలో చైతన్యాన్ని నింపేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తున్నది.
కల్చరల్‌ ఫెస్టివల్స్‌
హైదరాబాద్‌ నగరం ఒక మినీ భారత్‌. ఈ నగరం అన్ని రాష్ట్రాల సంస్కృతుల సమ్మేళనం. అది హైదరాబాద్‌ ప్రత్యేకత. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సగర్వంగా చాటేలా హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కల్చరల్‌ ఫెస్టివల్స్‌లను నిర్వహిస్తుంది. 2018లో ప్రారంభమైన ఈ కల్చరల్‌ ఫెస్ట్‌ కరోనా కారణంగా ఒక్క సంవత్సరం మినహా 2025 వరకూ నిరాఘాటంగా కొనసాగుతున్నది. ఈ ఏడాది భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా హైస్కూలు విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో 9 డివిజన్ల నుండి 90 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 10,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జోనల్‌ లెవల్‌లో విజేతలైన విద్యార్థులకు ప్రోత్సహంగా మెమోంటోలు, సర్టిఫికెట్లను అందచేశారు.
ఈ నెల 2న రవీంద్ర భారతిలో జరిగిన కల్చరల్‌ ఫెస్టివల్‌లో 19 రకాల కళా ప్రదర్శనలలో సుమారు 200 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కళారత్న మల్లం రమేష్‌ గారు ప్రత్యేక పాత్రను పోషించారు. ప్రముఖ మ్యాజిక్‌, మిమిక్రీ కళాకారులు ప్రేక్షకులను అలరించారు.
అంబేద్కర్‌ కాలేజీ ఇంటర్‌ కళాశాల కళాకారులచే జయహో అంబేద్కర్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ నత్యాలు నవీన్‌ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. జయహో అంబేద్కర్‌.. నువ్వే లేకుంటే ఏమైపోతుంటిమో బాబా అంబేద్కర్‌.. మీరే రాకుంటే మేము ఎట్లా బతుకుతుంటిమో నవభారత భాస్కర!… గానం చేస్తూ ప్రదర్శించిన నత్యం వీక్షకులను ఆకర్షించింది. హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్యారి ప్యారా హైదరాబాద్‌ నత్యం హైదరాబాద్‌ సంస్కతికి అద్దం పట్టింది. మిమిక్రీ, మ్యాజిక్‌ షో ప్రదర్శనలు అబ్బురపరిచాయి. త్రీ లెగ్స్‌ డాన్స్‌ మూడు నిమిషాలు ప్రదర్శించిన కళాకారుడు రమేష్‌ తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు. బెలూన్‌ డాన్స్‌ ప్రేక్షకులను అబ్బురపరిచింది. బెలూన్‌ నుండి బయటికి రావడం, లోపల నుండి దుస్తులు మార్చుకోవడం, నిజంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విధాత తలుపుల ప్రభవించినది.. అనాది జీవన వేదం.. ప్రాణనాడులకు స్పందన సాగిన అది ప్రణవనాదం… కృష్ణ కౌరీ వేణు గానం ఆకర్షణీయంగా సాగింది. అన్ని శబ్దాలు పద్ధతులలో ఒకేసారి వినిపించిన బీట్‌ వాయిస్‌ ఎంత అద్భుతమో వర్ణించ అలవి కాదు. వేదికపై ప్రదర్శించిన స్టాచ్యూ డాన్స్‌ది ఓ ప్రత్యేకత.
ఓరుమకల్చర్‌ అండ్‌ వెల్ఫేర్‌ సొసైటీ కేరళ నాదన్‌ పట్టు నత్యం చిన్మయ అసోసియేషన్‌ కేరళ నాదోది సంప్రదాయ నత్యం మహిళా కళాకారులు ప్రదర్శించిన తీరు చాలా బాగుంది. సంప్రదాయ సంస్కతికి అద్దంపట్టింది. దాదాపుగా 40 మంది మహిళా కళాకారులు ఆసక్తికరంగా ప్రదర్శించారు. ఓం డాన్స్‌ అకాడమీ చిన్నారులచే ప్రదర్శించిన బల్లే బల్లే పంజాబ్‌ నత్యం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. దేశభక్తితో కూడిన క్లాసికల్‌ డాన్స్‌ సైతం ఈ చిన్నారులు అంతే ఉత్సాహంతో ప్రదర్శించారు. హైదరాబాద్‌ జిందాబాద్‌ సంస్థ బృందం వారిచే మెడ్లే నత్యం హస్మిత మేఘన, దుర్గ, ఉదయ, దేవి, నేహ, ఉష.. సంస్కతి పాటపై అద్భుతంగా ప్రదర్శించారు. మరాఠీ కళాభిషేక్‌ బృందం చే మరాఠీ సంప్రదాయ నత్యం విభిన్న రీతులు అంశంగా శ్రోతలను పులకరింప చేసింది. ప్రగతి విద్యానికేతన్‌ విద్యార్థులచే కళాకారుల బృందం నువ్వో రాయి, నేనో శిల్పి.. నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ.., సేవ్‌ గర్ల్‌ నాటకం అద్భుతంగా ప్రదర్శించారు.
ప్రేక్షకులను ఉద్దేశించి మామిడి హరికష్ణ, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, మాదాల రవి, కిరణ్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఉన్నత అధికారి, సుబ్రహ్మణ్యం గారు ఎల్‌ఐసీ అధికారి శివశంకర్‌ పాల్గొని సందేశమిచ్చారు. మనిషి జబ్బునపడితే వైద్యులు వైద్యాన్ని అందిస్తారు, కానీ సమాజం జబ్బున పడితే కళాకారులు చైతన్యం నింపే కళారూపాలను ప్రదర్శించి నవ సమాజ నిర్మాణానికి బాధ్యత వహిస్తారంటూ అతిధులు సందేశమిచ్చారు. విద్యార్థులు చదువులతో పాటు శాస్త్రీయ దక్పథం కలిగిన సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి. సాంస్కతిక వైవిధ్యాన్ని కళారూపాలతో ప్రదర్శించి ఈనాటి విద్యార్థులు భావిభారత నిర్మాణం కోసం కషిచేసి సేవలు అందించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ అంటేనే బిరియాని, షేర్వానీ, కుర్తా, పైజామా అనీ, ఇది హైదరాబాద్‌ సంస్కతికి అద్దం పడుతుందని మామిడి హరికష్ణ గారు కొనియాడారు. ఒకప్పుడు హైదరాబాదు నగరంలో ముత్యాల రాశులు అంగళ్లలో పోసి అమ్మేవారు. మహిళలు చార్మినార్‌లో గాజులు ప్రత్యేకంగా కొని ధరించే వారిని ఇది హైదరాబాద్‌ సంస్కతిని తెలియపరిచేదని, హైదరాబాద్‌- జిందాబాద్‌ పేరులోనే, హైదరాబాదు పరిరక్షణపై, అభివద్ధి కోరుకునే సంస్థగా కీర్తి సంపాదించుకున్నదని కొనియాడారు. హైదరాబాద్‌ చరిత్రనే అవపోషణ పట్టినటువంటి పాశం యాదగిరి గారు చాలా చక్కటి విశ్లేషణతో తన సందేశాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపరు. కల్చరల్‌ ఫెస్ట్‌ రవీంద్రభారతిలో విజయవంతం కావడానికి హైదరాబాద్‌ జిందాబాద్‌ బృందం నిర్వాహకులు కె. వీరయ్య.ఎం. శ్రీనివాసరావు, పి. నాగేష్‌. నాగేశ్వరరావు, పెండ్యాల శ్రీనివాస్‌. మోహన్‌, సైదులు, కె. లలిత, సంగీత, అస్మిత, శంకరయ్య, శంకరన్న, గోపాల్‌ రాజమౌళి, సుకుమార్‌, రమేష్‌, మాధవి, శ్రీవల్లి, కార్తికేయ, మహేందర్‌, మేఘన తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు.
– దామర్ల సైదులు
9985766142

Spread the love