Wednesday, June 17, 2026
E-PAPER
Homeఆటలుమహిళల టి20 ప్రపంచకస్: నెదర్లాండ్స్‌తో భార‌త్ ఢీ

మహిళల టి20 ప్రపంచకస్: నెదర్లాండ్స్‌తో భార‌త్ ఢీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఐసీసీ మహిళల టి20 ప్రపంచకస్ వుమెన్ ఇండియా మ‌రో మ్యాచ్‌కు సిద్ధ‌మైంది. హర్మన్ ప్రీత్ సేన నేడు నెదర్లాండ్స్ తో తలపడనుంది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ మహిళలపై 64 పరుగుల తేడాతో గెలిచిన ఉత్సాహంతో నేటి మ్యాచ్‌కు సిద్ధమైంది. చిన్న జట్టయిన నెదర్లాండ్స్‌పై బ్యాటర్లు భారీ స్కోరు చేయాలని జట్టు ఆశిస్తోంది. మున్ముందు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్లను ఢీకొనాల్సి ఉన్న నేపథ్యంలో ఫీల్డింగ్‌లో భారత్‌ ఎంతో మెరుగుపడాల్సిన అవసరముంది. తొలి మ్యాచ్‌లో భారత్‌ బౌలింగ్‌ మాత్రం బాగా సాగింది. ముఖ్యంగా స్పిన్నర్లు దీప్తి, శ్రీ చరణి విజృంభించారు. డచ్‌ జట్టుపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో విజయం సాధించి, బలమైన దక్షిణాఫ్రికాతో పోరుకు ముందు మెరుగైన స్థితిలో ఉండాలని జట్టు ఆశిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -