Wednesday, June 17, 2026
E-PAPER
Homeజాతీయంనీట్ పేప‌ర్ లీకేజీ..నేడు కోటాలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

నీట్ పేప‌ర్ లీకేజీ..నేడు కోటాలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేడు రాజ‌స్థాన్‌లోని కోటా నుంచి కాంగ్రెస్ భారీ ర్యాలీ తీయనుంది. నీట్ పేప‌ర్ లీకేజీను వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ ప‌రీక్ష స్కామ్‌లు అనే పేరు ప్ర‌తిప‌క్ష‌నేత ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా కోటా నుంచి ఈ కార్య‌క్ర‌మం ప్రారంభంకానుంది. ఈమేర‌కు మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా దేశ యువ‌త‌కు రాహుల్ గాంధీ సందేశం ఇచ్చారు. నేడు కోటాలో జరిగే “ఎకో ఆఫ్ స్టూడెంట్స్” మెగా ర్యాలీలో దేశవ్యాప్తంగా యువత ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

‘పేపర్ లీక్‌లు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు, నియామకాల రద్దు, పెరుగుతున్న ఫీజులు, ప్రైవేటీకరణ, కుంభకోణాలు లక్షలాది మంది యువ భారతీయుల కలలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. భారతదేశంలోని ప్రతి యువత భవిష్యత్తును సురక్షితం చేయడం ప్రభుత్వ బాధ్యత. కానీ బాధ్యత, నిజాయితీ–కానీ, మోడీ ప్రభుత్వ వాటి ప‌ట్ల విరుద్ధంగా ఉంద‌ని’ ఆయ‌న రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -