– డిసెంబర్ 23తో ముగిసిన 9 నెలల నికర లాభం రూ.4000 కోట్లు దాటింది
నవతెలంగాణ – హైదరాబాద్ :ఐడిబిఐ బ్యాంక్ FY24లో మూడవ త్రైమాసికం (Q3) ఫలితాలను నేడు ప్రకటించింది. బ్యాంకు FY24లో మూడవ త్రైమాసికంలో ₹1,458 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఇది ఏడాది నుంచి ఏడాదికి పోల్చితే 57% బలమైన వృద్ధిని నమోదు చేసింది. నిర్వహణ లాభం ₹2,327 కోట్లుగా ఉంది. నికర వడ్డీ లాభం (NIM) 4.72% కాగా, నికర వడ్డీ ఆదాయం 17% వృద్ధితో ₹3,435 కోట్లుగా ఉంది. బ్యాంకు FY23లో మూడవ త్రైమాసికం (Q3) నాటి 3.51%తో పోల్చితే FY24లో మూడవ త్రైమాసికం (Q3) నాటికి డిపాజిట్ ధర 83 బిపిఎస్ పెరిగి, 4.34%కు చేరుకుంది. ఏడాది నుంచి ఏడాదికి 18 bps వృద్ధితో CRAR 20.32% వద్ద ఉంది. ఆస్తులపై రాబడి (ROA) 1.70% (ఏడాది నుంచి ఏడాదికి వృద్ధి 48 bps) మరియు రిటర్న్ ఆన్ ఈక్విటీ (ROE) 19.57% వద్ద నమోదైంది, (ఏడాది నుంచి ఏడాదికి వృద్ధి 361 bps). నికర NPA 0.34% కాగా, ఇది 74 bps మెరుగుపడింది. స్థూల NPA 4.69% మేర 913 bps మేర ఉంది. పీసీఆర్ (PCR) 119 bps తో 99.17% మేర ఉంది.