ఒక్కోసారి చిన్న ఆలోచన సైతం పెద్ద సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఒక ఐడియా జీవన గమనాన్నే మార్చింది. మొబైల్ ప్రచారం ప్రకటనలా చేతి పంపు మరమ్మత్తులు నిర్వహించే టెక్నీషియన్ ఐడియా ఒక పాఠశాల విద్యార్ధులకు అవసరం అయిన నీటి కొరతను శాస్వత పరిష్కారం చూపింది. ఒక చేతి పంపుకే విద్యుత్ మోటార్ అమర్చడంతో విద్యుత్ లేకపోయినా నీటిని వాడుకునే అవకాశం రావడంతో రెండు విధాలా ప్రయోజనం పొందుతున్నారు విద్యార్ధులు. మన ఊరు – మన బడి నిధులతో మండలంలోని ఎంపీ యూపీ ఎస్ పాఠశాలలో బోరు మోటార్ ఎర్పాటు చేయాలి. అయితే అప్పటికే వినియోగంలో ఉన్న చేతి పంపుకే మోటర్ విద్యుత్ అమర్చి దానితో నీటిని సంప్ లోకి పంపి తద్వారా ట్యాంక్ లోకి ఎక్కించి వినియోగించుకుంటున్నారు. నవతెలంగాణ ఇటీవల ఈ పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఈ దృశ్యం కనపడింది. హెచ్.ఎం క్రిష్ణా రావు మాట్లాడుతూ.. విద్యుత్ లేని సమయంలో సైతం విద్యార్ధులకు నీటి కొరత లేకుండా చేతి పంపు రెండు విధానాలు గా ప్రయోజనం పొందుతున్నారు అని హర్షం వ్యక్తం చేసారు.