ఆస్ట్రేలియాలోని పౌర గ్రంథాలయాలు విస్తతమైన సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ, న్యూ సౌత్‌వేల్స్, నార్తర్న్ టెరిటరీ, క్వీన్స్‌లాండ్, సౌత్ ఆస్ట్రేలియా, టాస్మానియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్రాల్లో పౌరులు పౌర గ్రంథాలయాలను వివిధ రకాలుగా వినియోగిస్తున్నారు. ఈ గ్రంథాలయాలు పుస్తకాలు, డిజిటల్ వనరులు, ఆడియో బుక్స్, ఇ-పుస్తకాలు, సాంకేతిక ఉపకరణాలు, అనేక ఇతర విద్యా వనరులు అందిస్తాయి. పాఠకులను ఆకర్షించేందుకు అవి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. పుస్తక సమీక్షలు, రచయితల సమావేశాలు, విద్యా సదస్సులు, కూర్పు శిక్షణ, క్రీడా కార్యక్రమాల వంటివి ఇందులో వుంటాయి.
గ్రంథాలయాలు వద్ధి చెందడానికి ప్రభుత్వాలు విస్తతంగా బడ్జెట్ కేటాయించాయి. ఈ బడ్జెట్ ద్వారా పౌర గ్రంథాలయాలకు ఆధునిక సాంకేతిక వనరులు, మరిన్ని పుస్తకాలు, సమగ్ర సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ, దూర ప్రాంతాలలో ఈ సేవలు మరింత సమర్థవంతంగా అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక దష్టి సారిస్తుంది.
ఈ విధంగా ఆస్ట్రేలియాలో పౌర గ్రంథాలయాలు ప్రజలకు అనేక రకాల విద్యా, సమాచార, సాంస్కతిక సేవలను అందిస్తున్నాయి. అక్కడ 2018-19లో 1409 బ్రాంచ్ గ్రంథాలయాలు, 81 మొబైల్ గ్రంథాలయాలు, 193 ఇతర గ్రంథాలయ అవుట్‌లెట్లు ఉన్నాయి. 2022-23లో ఈ సంఖ్య పెరిగి 1412 బ్రాంచ్ గ్రంథాలయాలు, 76 మొబైల్ గ్రంథాలయాలు, 226 ఇతర అవుట్‌లెట్లు అయ్యాయి. ఇదే సమయంలో, 2022-23లో మొత్తం 29,10,186 గంటల సేవలు ప్రజలకు అందించాయి. 2022-23 నాటికి 33.48 మిలియన్ ఫిజికల్ పుస్తకాలు, 100.60 మిలియన్ డిజిటల్ వనరులు పౌర గ్రంథాలయాలలో అందుబాటులో ఉన్నాయి.
పుస్తకాలు, డిజిటల్ వనరుల వినియోగం: 2021-22 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో సుమారు 150 మిలియన్ పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పుస్తకాలు, ఆడియో పుస్తకాలు, ఇతర డిజిటల్ వనరులు అందుబాటులో ఉన్నాయి. సగటు ఆస్ట్రేలియన్ పౌరుడు ప్రతి సంవత్సరం 6 పుస్తకాలు కొనుగోలు చేస్తాడు. అలాగే సగటున 8 పుస్తకాలు పౌర గ్రంథాలయాల నుండి తీసుకుంటాడు.
ఆస్ట్రేలియన్ పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్ స్టాస్టిక్స్ 2024 ప్రకారం 2023-24 సంవత్సరంలో పౌర గ్రంథాలయాల వినియోగం 35% పెరిగింది. ఇందులో ప్రధానంగా డిజిటల్ వనరుల వినియోగం పెరిగినట్టు కనిపిస్తోంది. 2018-19లో డిజిటల్ వనరుల వినియోగం 15% వరకు ఉండగా, 2022-23లో అది 23%కి చేరుకుంది. భౌతిక పుస్తక వనరుల వినియోగం కూడా పెరిగింది. డిజిటల్ సేకరణలు, ప్రత్యేకంగా ఆడియో పుస్తకాలు, డిజిటల్ పుస్తక ఫార్మాట్‌ల పట్ల పాఠకుల ఆసక్తి పెరుగుతోందని చెప్పవచ్చు. ప్రస్తుత సాంకేతిక కాలంలో, డిజిటల్ పుస్తకాలు, ఆడియో పుస్తకాలు, ఇతర సాంకేతిక వనరుల వినియోగం పెరుగుతున్న కారణంగా పౌర గ్రంథాలయాలకు సందర్శకుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది.
వైఫై వాడకం: పౌర గ్రంథాలయాల్లో వైఫై వాడకం గణనీయంగా పెరిగింది. 2018-19లో 6.5 మిలియన్ గంటలు వైఫై వాడకం నమోదు చేయబడినప్పటికీ, 2022-23లో ఈ సంఖ్య 12 మిలియన్ల గంటలకు పెరిగింది.
గ్రంథాలయ సేవలు, నిధులు, ఖర్చులు: 2018-19లో పౌర గ్రంథాలయాల సర్వీసులకు 1331.17 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, 2022-23లో ఈ ఖర్చు 1306.39 మిలియన్ డాలర్లకు తగ్గింది. 2018-19లో ప్రతి వ్యక్తికి 52.49 డాలర్లు ఖర్చయ్యాయి. అయితే 2022-23లో ఇది 49.74 డాలర్లకు తగ్గింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం ద్రవ్యోల్బణం.
రాష్ట్రాల వారీగా పుస్తకాల సంఖ్య : క్వీన్స్‌ల్యాండ్: 0.58 మిలియన్, న్యూ సౌత్ వేల్స్: 16.1 మిలియన్, నార్తర్న్ టెరిటరీ: 0.32 మిలియన్, సౌత్ ఆస్ట్రేలియా: 2.92 మిలియన;, టాస్మానియా: 0.61 మిలియన్, విక్టోరియా: 9.10 మిలియన్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా: 4.80 మిలియన్ మొత్తం పుస్తకాలు: 43.53 మిలియన్
రాష్ట్రాలలో గ్రంథాలయ వనరుల వినియోగం: ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ: ఫిజికల్ వనరులు: 1.48 మిలియన్, డిజిటల్ వనరులు: 0.86 మిలియన్; న్యూ సౌత్ వేల్స్ ఫిజికల్ వనరులు: 33.25 మిలియన్, డిజిటల్ వనరులు: 11.22 మిలియన్; టాస్మానియా: ఫిజికల్ వనరులు: 0.56 మిలియన్, డిజిటల్ వనరులు: 0.25 మిలియన్; క్వీన్స్‌ల్యాండ్ ఫిజికల్ వనరులు: 25.64 మిలియన్, డిజిటల్ వనరులు: 12.69 మిలియన్; సౌత్ ఆస్ట్రేలియా ఫిజికల్ వనరులు: 7.66 మిలియన్, డిజిటల్ వనరులు: 4.27 మిలియన్; విక్టోరియా ఫిజికల్ వనరులు: 31.54 మిలియన్, డిజిటల్ వనరులు: 11.09 మిలియన్; వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫిజికల్ వనరులు: 10.96 మిలియన్, డిజిటల్ వనరులు: 4.40 మిలియన్. మొత్తం వనరులు:ఫిజికల్ వనరులు: 159.6 మిలియన్, డిజిటల్ వనరులు: 54.36 మిలియన్ కలవు. ఈ సంఖ్యలు పౌర గ్రంథాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న వనరులు, సేవల పరిమాణాన్ని సూచిస్తున్నాయి. వాటిని మరింత సమర్థవంతంగా అభివద్ధి చేయడం, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలను అందించడం ఉద్దేశించబడింది. ఈ వివరాలు ఆస్ట్రేలియాలోని పౌర గ్రంథాలయాల్లోని ఫిజికల్, డిజిటల్ వనరుల వినియోగంలో భేదాన్ని, అలాగే టెక్నాలజీ వినియోగంలో పెరుగుదలని సూచిస్తాయి.
ప్రాంతాల వారీగా వనరులు: ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ, న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్‌ల్యాండ్, టాస్మానియా, సౌత్ ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పౌర గ్రంథాలయాల్లో పుస్తకాలు, డిజిటల్ వనరులు, వైఫై సేవల వినియోగం అధికంగా ఉంది. ఉదాహరణకు, న్యూ సౌత్ వేల్స్‌లో 33.25 మిలియన్ ఫిజికల్ వనరులు, 12.69 మిలియన్ డిజిటల్ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలయాలు పౌరులకు అన్ని రకాల వనరులను అందించే ప్రయత్నం చేస్తాయి. అందులో పుస్తకాలు, డిజిటల్ పుస్తకాలు, ఆడియో పుస్తకాలు, ఇతర విద్యా వనరులు, వైఫై సేవలు కూడా ఉన్నాయి.
ఆస్ట్రేలియన్ పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్ స్టాస్టిక్స్ పరిశీలించిన కార్యక్రమాలు: 2021-22, 2022-23 మధ్య కాలంలో, ఆస్ట్రేలియాలోని పౌర గ్రంథాలయాలు 95,000 కంటే ఎక్కువ కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ కార్యక్రమాలు పిల్లలు, యువత, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ప్రత్యేకంగా, విక్టోరియా రాష్ట్రంలో 89,104 కార్యక్రమాలు, న్యూ సౌత్ వేల్స్‌లో 86,212 కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలు పాఠకులకు పఠన ప్రోత్సాహనంతో పాటు, వారి సాంస్కతిక, సామాజిక, విద్యా అభివద్ధికి తోడ్పడుతాయి.
ప్రధాన కార్యక్రమాలు: కథా సమయం, ఇంగ్లీషు సంభాషణ కార్యక్రమాలు, హోంవర్క్ సహాయం, చదవడంపై దష్టి పెట్టే కార్యక్రమాలు, అధ్యయనపు అలవాట్లు, నైపుణ్యాల అభివద్ధి, పఠనాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు, శిక్షణకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలు, వినోదం కోసం పఠనంపై దష్టి పెట్టే కార్యక్రమాలు. 2021-22లో 2,59,000 గ్రంథాలయ ప్రోగ్రాములు నిర్వహించబడ్డాయి. 2022-23లో ఈ సంఖ్య 354,000కి పెరిగింది. ఈ ప్రోగ్రాములకు 6.1 మిలియన్ మందికి పైగా పాఠకులు హాజరయ్యారు. ఇది పౌర గ్రంథాలయాల పట్ల ప్రజల ఆసక్తిని సూచిస్తుంది.
ఆస్ట్రేలియా పౌర గ్రంథాలయాలు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడానికి, అక్షరాస్యత, వ్యక్తిత్వ అభివద్ధి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోసం విస్తతమైన సేవలను అందిస్తున్నాయి. డిజిటల్ వనరుల వినియోగం పెరిగినందున, ఈ గ్రంథాలయాలు ఆన్‌లైన్ ద్వారా మరింత సులభంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు, పాఠకులను ఆకర్షించేందుకు, సమాజంలో ప్రభావవంతమైన పాత్ర పోషించేందుకు కషి చేస్తున్నాయి.
గ్రంథాలయ సభ్యుల సంఖ్య: 2018-19లో (రిజిస్టర్ గ్రంథాలయ సభ్యులు) మొత్తం 9,051,026 మంది సభ్యులు ఉన్నారు. కానీ 2022-23లో ఈ సంఖ్య 8,260,566కి తగ్గింది. దీనికి కారణం ప్రజలు ఎక్కువగా వెబ్సైట్ల ద్వారా వారి కావలసిన పుస్తకాలను డిజిటల్ ఫార్మాట్‌లో పొందడం ప్రారంభించారు. డిజిటల్ వనరుల పెరుగుదల, ఆన్‌లైన్ సదుపాయాల కారణంగా, సాంప్రదాయంగా సభ్యత్వం పొందిన గ్రంథాలయ సభ్యుల సంఖ్య తగ్గింది.
గ్రంథాలయ సందర్శన: 2018-19లో 110,612,784 పాఠకులు గ్రంథాలయాలను సందర్శించారు. అయితే, 2022-23లో ఈ సంఖ్య 78,878,875 మందికి మాత్రమే పరిమితమైంది. ప్రతి నెలా 9,217,732 మంది పాఠకులు 2018-19లో గ్రంథాలయాలను సందర్శించగా, 2022-23లో ఈ సంఖ్య 6,573,240 మందికి తగ్గింది.
గ్రంథాలయ వెబ్‌సైట్ల సందర్శన: 2018-19లో, 51,90,144 మంది పాఠకులు గ్రంథాలయ వెబ్సైట్లను సందర్శించారు. 2022-23లో ఈ సంఖ్య 70,61,5778 కి చేరుకుంది. దీని కారణం, పాఠకులు డిజిటల్ పుస్తక వనరులను వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో అందిపుచ్చుకుంటున్నారు. దీనితో వారికీ సులభంగా పుస్తకాలు, పఠన వనరులు, ఇతర ఆన్‌లైన్ సేవలు లభిస్తున్నాయి. పెరుగుతున్న డిజిటల్ వనరుల వినియోగంతో, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు, ఆన్‌లైన్ సేవలను అందించేందుకు, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన విద్యా వనరులను అందించేందుకు అనేక మార్గాలలో కషి చేస్తున్నాయి.
పాఠకుల మరియు కార్యక్రమాల సంఖ్య: 2021-22 సంవత్సరంలో, ఆస్ట్రేలియాలోని పౌర గ్రంథాలయాలలో 6 మిలియన్ పాఠకులు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ పాఠకులలో:చిన్నపిల్లలు (ఎర్లీ చైల్డ్ పీపుల్): 313,675, పిల్లలు (విద్యార్థులు): 1,213,198. మొత్తం యువకులు, మహిళలు, వద్ధులతో కలిపి 6,148,529. ఈ వివరాలు పౌర గ్రంథాలయాల్లోని వివిధ వయోమాండలిక వర్గాల కోసం నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని సూచిస్తాయి.
అక్షరాస్యత, డిజిటల్ ఇంక్లూజివ్‌నెస్, వ్యక్తిత్వ అభివద్ధి కార్యక్రమాలు: ఆస్ట్రేలియా పౌర గ్రంథాలయాలు పాఠకులకు వివిధ సమాజ వర్గాలపై దష్టి సారించి నిర్వహించే అక్షరాస్యత, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రోగ్రాములు, డిజిటల్ ఇంక్లూజివ్‌నెస్, వ్యక్తిత్వ అభివద్ధి కార్యక్రమాలలో 5,883,963 పాఠకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు పిల్లలు, విద్యార్థులు, యువత, మహిళలు, వద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
కార్యక్రమాల విభజన: అక్షరాస్యత, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రోగ్రాములు: 17,145, డిజిటల్ ఇంక్లూజివ్‌నెస్: 6,639, పర్సనాలిటీ డెవలప్‌మెంట్: 58,219. ఈ వివరాలు, పౌర గ్రంథాలయాలు వివిధ సామాజిక వర్గాలకు సేవలు అందించడంలో ఎంతగానో కషి చేస్తున్నాయి. సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రాములను రూపొందించడం ద్వారా వాటి వినియోగాన్ని పెంచడాన్ని సూచిస్తున్నాయి. ఈ వివరాలు ఆస్ట్రేలియాలోని పౌర గ్రంథాలయాల సమగ్ర సేవలతో సంబంధం కలిగి ఉన్నాయి. గ్రంథాలయాలు కేవలం పుస్తకాలు మాత్రమే కాకుండా, విద్య, సాంస్కతిక అభివద్ధి, సామాజిక సేవలలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు, సేవలు పాఠకుల అభివద్ధికి, వారి సామాజిక సంబంధాలు, వ్యక్తిత్వ అభివద్ధికి సహాయపడుతున్నాయి.
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే, ఆస్ట్రేలియాలోని పౌర గ్రంథాలయాలు సేవలు, పని గంటలు, వనరుల అందుబాటులో అనేక మోడల్స్‌ను ఏర్పరచి ఉన్నాయి. ఈ గ్రంథాలయాలు పుస్తకాలు, డిజిటల్ వనరులు, ప్రజల అవసరాలను తీర్చేందుకు అన్ని విధాలుగా కషి చేస్తున్నాయి. తద్వారా అవి ఇతర దేశాలకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నాయి.
– డా|| రవికుమార్ చేగొని,
9866928327