పార్టీకి పనిచేసే వారికి సముచితమైన స్థానం..

– తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
– కాంగ్రెస్ పార్టీలో చేరిన బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, మాజీ కౌన్సిలర్ గాయత్రి
నవతెలంగాణ – సూర్యాపేట
కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వారికి భవిష్యత్తులో సముచితమైన స్థానం లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్  పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్,మాజీ కౌన్సిలర్ గాయత్రి ల ఆధ్వర్యంలో 250 మంది గురువారం స్థానిక రమేష్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు రాబోతున్నాయని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికo మెజార్టీ తో గెలిపించాలని కోరారు.రాష్ట్రంలో 14 నుండి 15 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం అన్నారు.ఇచ్చిన ప్రతి హామీని తక్కువ సమయంలోనే అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ దే అని అన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ 10 లక్షల బీమా, సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేశామని గుర్తు చేశారు.ఇప్పటివరకు 30 వేల ఉద్యోగాలను కల్పించిన చరిత్ర కాంగ్రెస్ కే దక్కిందన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం అర్హులైన వారికి రేషన్ కార్డులు పింఛన్లు అందజేసేలా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. సూర్యాపేట ప్రాంతాన్ని దత్తత తీసుకుని విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.బి.ఆర్.యస్ కు చెందిన  మాజీ కౌన్సిలర్ నిమ్మల వెంకన్న, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గాయం కర్ణాకర్ రెడ్డి, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బొల్లెద్దు వినయ్, తదితరులతో పాటు 250 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీ ఉల్లా,వెలుగు వెంకన్న,ఎడ్ల గంగా భవాని,నామ అరుణ,దారవత్ లీలావతి లింగనాయక్, జ్యోతి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love