ప్రపంచంలో ఎక్కడా లేని కులవ్యవస్థ కేవలం మన దేశంలో మాత్రమే ఉంది. మూడు వేల ఏండ్ల కిందటి మను స్మృతి మానసిక చట్టాల ఫలితంగా ఏ కులంలో పుట్టినవాడు ఆ కులంలోనే వివాహం చేసుకోవాలి, ఆ కులంలో చావాలి. ఇది మన భారతదేశంలో మాత్రమే ఉన్న ఒక దుర్మార్గపు మానసిక నిబంధన. రాజ్యాంగ చట్టాలు మనుషులందరికి తెలి యదు. కేవలం ‘లా’ చదివినవారికి మాత్రమే తెలుసు. కానీ, మనుస్మృతి మానసిక చట్టాలు వేల ఏండ్లుగా వంశపారంపర్యంగా అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అని తేడా లేకుండా అమలు చేస్తు న్నారు. దీంతో కులం భారతదేశంలో క్యాన్సర్‌కంటే ప్రమాదకరమైన జబ్బు గా మారింది. కులం కట్టుబాట్లను తొలగించడానికి దేశంలో అనేక ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించ బడ్డాయి. కుల నిర్మూలన జరగాలని కలలుకన్న వారి ఆశయాలు నేటికి నెరవేర్చబడలేదు. జ్యోతిబాపూలే, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కమ్యూనిస్టు నేతలు, నాస్తిక వాదులవంటి అనేకమంది మహానీయులు కుల నిర్మూ లన కోసం అనేక త్యాగాలు చేశారు. వంశపారంపర్యంగా కుల వ్యవస్థ కొనసాగింపు వివాహవ్యవస్థలోనే దాగి ఉందని గ్రహించారు.
కుల నిర్మూలన జరగాలని భారత రాజ్యాంగం నిర్దేశించు కున్నది. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు ఓ మెట్టులాగా ఉంటాయని భావించింది. కులాంతర వివాహాలను చేసుకున్న వారిని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం కొన్ని పారితోషకాలు కూడా ఇస్తున్నది. అందుకే ఆ రోజుల్లోనే జ్యోతిబాపూలే పూజారి లేని ఆదర్శ వివాహాలను పూలదండలు మార్చడం ద్వారా జరిపిం చారు. వారి అడుగుజాడల్లో నేటి పౌర సమాజం ఆదర్శ వివాహా లను ప్రోత్సహించే సామాజిక బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉన్నది.వివాహానికి 21 ఏండ్లు నిండిన యువకుడు, 18 ఏండ్లు నిండిన యువతి ఉంటే చాలు. కులమేదైనా, మతమే దైనా, ప్రాంతమేదైనా, భాష వేరైనా, దేశం వేరైనా ప్రేమించుకొని జీవిత భాగస్వా ములుగా సహజీవనం గడిపే హక్కు రాజ్యాంగ బద్ధంగా కల్పించబడింది. వివాహానికి ముందు చూడాల్సింది కులం, మతం కాదు.ఆస్తులు అంతస్తులు అంతకన్నా కాదు. క ట్నాలు, డబ్బులు అవసరమే లేదు, గుణం గొప్పదై ఉండాలి. మ తం కంటే మానవత్వం ఉండాలి.మల్లె పువ్వు లాంటి మనసు కష్టసుఖాల్లో ఒకరికొకరు కంటికి రెప్పలా కాపాడు కోగలరా అనే ఆత్మవిశ్వాసం ఉండాలి. జీవిత కాలం కలిసి ఉండడానికి జీవనోపాధి తప్పనిసరి. కేవలం కు లం కారణంగానే రెండు మనసులు కలిసి మానసిక ఐక్యత సాధించిన వ్యక్తులు దూరం కాకూడదు. పర స్పరం చర్చించుకుని వాటిపై అంగీకారం కుదిరితే ఆదర్శ వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఉండ కూడదు ఏ అర్హతలు లేకపోయినా పర్వాలేదు కానీ, మా కులం వాడైతే చాలు అది బాల్యవివాహమైన లక్ష ల రూపాయల కట్నాలు పోసి అయినా, మా కులం వాడికే ఇచ్చి వివాహం చేస్తాను. మా కులం కానీ వాడిని ప్రేమిస్తే ఊరుకోం, అవసరమైతే కన్నబిడ్డనైనా కడతేరు స్తాం అనే కసాయిమూకలు జీవిస్తున్న సమాజమిది. లక్షలాది రూపాయల కట్నాలు పోసి పెళ్లిళ్లు జరిపి తమ కులం వాడైతే కట్నం ఎంతిస్తారు? ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి?అవి మాత్రమే చూడడంతో తమ జీవిత భాగస్వామిని చూసుకునే అవకాశం నేటి యువతరానికి దక్కడం లేదు. నూరేళ్ల జీవితం తమ తల్లి దండ్రులపై కట్టబెడితే ఎలా? పెళ్లి రోజు మాత్రమే మొహాలు చూసుకునే వారు ఆ రోజు నుండి మాత్రమే ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటారు. దీని వల్ల అపార్థం చేసుకోవడం, పర స్పరం తమ మనసులను గాయపరచుకోవడంపై కేంద్రీకరణ జరుగుతున్నది. ఆప్యాయత అనురాగాలతో జీవించాల్సిన యువ తరం కులం కుదిర్చినపెండ్లిళ్లు, కట్న కానుకలు పుచ్చుకున్న పెండ్లిళ్లను చూస్తుంటే కుల మతాంతర వివాహాలు ఎంతో ఆదర్శవంతమైనవిగా గుర్తించాలి.
పురాతన కాలం నుండి కుల మతాంతర వివాహాలు జరి గాయి. మహాముని వశిష్టుడే దళితురాలిని వివాహమాడారు. వేెంకటేశ్వరుడు బీబీ నాంచారిని ప్రేమించి వివాహమాడాడు. కానీ వేంకటేశ్వరుడిని ప్రతీ రోజు పూజించే వాళ్లు కూడా తమ కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదని, తమ కూతురికి భర్తగా ఉన్న వ్యక్తిని, అంటే తన అల్లుడిని సుఫా రీ ఇచ్చి నరికి చంపుతున్నటువంటి ఉదంతాలను కండ్లారా చూ స్తున్నాం. ప్రేమికులపై ఎందుకింత కుల,మత విద్వేషాలు? నేడు దేశంలో కులదురంహకార హత్యలు పెరిగి పోయాయి. ఆధి పత్య కులరక్కసి విషపు నాగులాగా బుసలు కొడుతున్నప్పుడు కుల దురహంకార హత్యలు పెచ్చరిల్లుతున్నాయి. సమాజాభి వృద్ధిని కాంక్షించే సామాజిక ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ లు ఆదర్శ వివాహాలకు అండగా నిలుస్తున్నప్పటికీ మెజారిటీ స మాజం మనువాద కుల సంస్కృతి అడ్డుగోడల్ని ఛేదించలేక పోతున్నది. ఇది మారాల్సిన అవసరం ఉన్నది. రాజకీయ పార్టీ లు కూడా సామాజిక బాధ్యతతో వ్యవ హరించాలి. ప్రేమించు కున్న వారిని చేరదిసి ఆదర్శ వివాహాలను జరిపించాలి. కుల, మతాంతర పెండ్లిళ్లను ప్రోత్సహించడం కోసం ఎన్నికల మ్యాని ఫెస్టోలో చేర్చాలి. కులదురహంకారుల వంచన చేరి ప్రేమికు లను దూరం చేయరాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారు వందకు పైగా కుల దురహంకార హత్యలు జరిగాయి.
2017లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పెరు మాండ్ల ప్రణరు అనే దళిత యువకుడు అమృత అనే వైశ్య యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గర్భిణిగా ఉన్న ఆమె ను హాస్పిటల్‌లో వైద్యం చేయించుకొని తిరిగొస్తుండగా కోటి రూపాయలు సుఫారీ ఇచ్చి అమృత తండ్రి మారుతిరావు అత్యం త క్రూరంగా ప్రణరుని నరికి చంపించాడు. ఈ ఒక్క ఘటన చాలు కుల దురహంకారం ఎలా రాజ్యమేలుతుందో చెప్పడానికి. కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహించి, కుల దురహంకార శక్తులను వంచన చేర్చుకునే మతోన్మాద శక్తులు కూడా మన మధ్యలోనే ఉన్నాయన్న సంగతి మరవరాదు. భజరంగ్‌దళ్, విహెచ్‌పీ, ఏబీ వీపీ వంటి మనువాద మతోన్మాదులు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున, పార్కుల దగ్గర మారణాయుధాలతో, కర్రల తో దాడులకు దిగుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. సమా జ అభ్యుదయాన్ని సహించలేని తిరోగమన శక్తులకి బుద్ధి చెప్ప డానికి, ప్రేమికుల రోజున కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) వంటి సంస్థలు ఆదర్శ దంపతులను అభినందిస్తూ సభలు నిర్వహిస్తున్నది.
కుల దురహంకార హత్యలు, దాడుల తర్వాత ప్రేమికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోలీస్ స్టేషన్లలోకి వెళ్లి తమకు రక్షణ కల్పించాలని దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. వారికి రక్ష ణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ప్రభుత్వం వారి అర్హతను బట్టి ఉద్యోగాలలో రాయితీలివ్వాలి. ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించివ్వాలి. వారి పిల్లల చదువుల ఖర్చులు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అనేక జీవోలు ఉన్నప్పటికీ అవేవీ అమలుకు నోచుకోవటం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఆదర్శ దంపతులకు ప్రత్యేక ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, తెలంగాణ కొత్త ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆచరించాలి. రాజస్థాన్ ప్రభు త్వం కులాంతర వివాహితుల ప్రత్యేక రక్షణ చట్టం చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. మన అసెంబ్లీ కూడా చట్టం చేయాలి. కేవలం వయసు మాత్రమే గీటురాయిగా పరిగణించి అలాంటి వివాహాలను పోలీస్ స్టేషన్‌లోనే జరిపించి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలి. దాడులకు దౌర్జన్యాలకు చోటు లేకుండా కుల దురహంకార హత్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సమాజ అభ్యుదయం కాంక్షించే అన్ని రాజకీయ పార్టీలు వారి పార్టీలో ప్రతి ఏటా ఎన్ని ఆదర్శ వివాహాలు జరిపించారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆదర్శ వివాహాలు మన దేశ భవిష్యత్తుకు దోహదం చేస్తాయి. కులరహిత భారత్‌గా రూపుదిద్దుకోవటానికి మొట్టమొదటి మెట్టుగా ఉంటాయి. కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు అండగా నిల వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతుందో పౌర సమాజంపై అంతకన్నా ఉంది
(నేడు ప్రేమికుల దినోత్సవం)
స్కైలాబ్‌బాబు 9177549646
ఆదర్శ వివాహాలు- సామాజిక బాధ్యత
10:57 pm