నవతెలంగాణ- మునుగోడు: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్న, పేద ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మునుగోడు వైఎస్ ఎంపిపి అనంత వీణ స్వామి గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని చీకటి మామిడి ఆ గ్రామంలో గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ 6 గ్యారెంటీ లపై ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామంలో ప్రజలంతా చెయ్యి గుర్తుకే జై కొడుతున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో మునుగోడు నియోజకవర్గం ను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గానికి కేటీఆర్ చేసిన అభివృద్ధి చేసినది ఎక్కడో చూపించాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల సొంత గ్రామానికి కూత పెట్టు దూరంలో ఉన్న చల్మడ గ్రామం ను అభివృద్ధి చేయలేనోడు నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని చెప్పడం నవ్వుకునే విధంగా ఉందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజనామంతో మునుగోడు నియోజకవర్గంకు గుర్తింపు వచ్చిందని అన్నారు. నాలుగు సంవత్సరాలు మునుగోడు నియోజకవర్గంకు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అసెంబ్లీలో కొట్లాడితే నయా పైసా ఇవ్వని కెసిఆర్ రాజన్న రాజీనామాతో 560 కోట్ల నిధులను మంజూరు చేశారంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఫలితంగా నిధులు వచ్చాయనేది నియోజవర్గంలోని ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటమి భయం పట్టి పీడిస్తుంది అని తెలిపారు . ఈనెల 30న జరిగే ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి రాజగోపాల్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలోని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాలకూరి యాదయ్య తో పాటు ఆ గ్రామంలోని సీనియర్ కార్యకర్తలు ,యువకులు తదితరులున్నారు