అ పార్టీ లా మాటలు వింటే మోసపోయి గోసపడ్తం..

 – అబివృద్ధి, సంక్షేమ పథకాలే గెలుపునకు నంది..
 – ప్రచార సభలో బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ- డిచ్ పల్లి: అ పార్టీ లా మాటలు వింటే మోసపోయి గోసపడ్తమని, అబివృద్ధి, సంక్షేమ పథకాలే గెలుపునకు నంది అని ప్రజలు,గ్రామల అభివృద్ధి ద్యేయంగా బీఆర్ఎస్  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఎలాంటి అనుమానాలకు తావు లేదని, పేదలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇస్తున్న ఉత్తుత్తి హామీలు అమలుకు నోచుకోవని వారివి మోసపూరిత వాగ్ధానాలని బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో పాల్గొని మాట్లాడారు. సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, పాఠశాల ప్రహారీగోడ తదితర పనుల అభివృద్ధి కోసం సిఎం కేసీఆర్తో మాట్లాడి నాలుగున్నర కోట్ల మేర నిధులను ఇప్పించామని గుర్తు చేశారు. రూరల్ లోని ఏ గ్రామం చూసినా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు.  ప్రజలందరూ బీఆర్ఎస్ కే ఓట్లు వేయాలని కోరారు. ధర్మారం(బి) గ్రామంలో మిగిలిపోయి ఉన్న కొద్దిపాటి పనులను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసే బాధ్యత నాపై ఉందన్నారు. నగరం నుండి మొదలుకొని నాగ్పూర్ గేటు వరకు సెంట్రల్ లైటింగ్, డబుల్ రోడ్డు, డివైడర్ నిర్మాణం చేశామని, ధర్మారం నుండి మెంట్రాజ్పల్లి వరకు ఎన్నో ఏళ్ల కల డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయటం జరిగిందన్నారు. ధర్మారం గ్రామంలో ఇల్లు లేని వారికి ఇళ్ల నిర్మాణంకు స్థలాలు అందజేస్తామన్నారు. స్థలలు ఉన్న వారందరికీ గృహ లక్ష్మి నుండి నీదులు అందజేస్తామన్నారు. రాష్ట్రం వచ్చాక రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించిన ఘనత సిఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, వారు చేసిందేమి లేదని, కానీ బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందజేశామన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి జరగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, 1200 కు ఉన్న గ్యాస్ సిలిండరు 400లకే అందించడం జరుగుతుందన్నారు. గతంలో విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండే వారని, నేడు ప్రస్తుతం ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో విరాజిల్లుతు పంటల దిగుబడి పెరిగి ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు, బోనాలతో డప్పు వాయిధ్యాల మధ్య బాజిరెడ్డికి ఘనస్వాగతం పలికారు.
కార్యక్రమంలో పార్టీ రూరల్ ఇన్చార్జి వీ గంగాధర్ గౌడ్, పార్టీ అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ పత్తి మమత ఆనంద్, కమ్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కలగర శ్రీనివాసరావు, పార్టీ నాయకులు నాగార్జున, యువ నాయకులు పృథ్వి రాజ్, రామకృష్ణ, సోమనాథ్, సాయిబాబా, సాయన్న, ఇర్ఫాన్, బాబా, పద్మరావు, సాయిలు, శక్కరి కోండ కృష్ణ, సురేష్, మోహన్రెడ్డి, మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love