
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు.శనివారం మండలంలోని తాడిచెర్ల, మల్లారం గ్రామాల్లో గణేష్ మండపాలను కాటారం సిఐ నాగార్జున రావు,కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ తో కలిసి సందర్షించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడారు ఈ నెల 16, 17 తేదీల్లో వినాయక నిమజ్జనానికి చెరువుల్లో,వాగుల్లో విగ్రహాలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమ జ్జన కార్యక్రమాలు చేయాలన్నారు.నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులు మండల యంత్రాగం నిర్దేశించిన ప్రదేశం వరకే అనుమతి మాత్రమే ఉంటుందని,భక్తులు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవాల కమిటి సభ్యులు పాల్గొన్నారు.