ఉచిత విద్యుత్ పథకం అమలు సరిగ్గా జరగడం లేదు: సురేష్ గొండ

– సీపీఐ(ఎం) పార్టీ  అధ్వర్యంలో లబ్దిపొందని వారితో సబ్ స్టేషన్ ను ముట్డడిస్తాం
నవతెలంగాణ – జుక్కల్
నండలంలోని పలు గ్రామాలలో గృహలక్ష్మీ ఉచిత విద్యుత్ పథకం అమలు తీరు అధికారుల నిర్లక్ష్యం వలన వేలాది కుటుంబాలకు అందడం లేదని సీపీఐ(ఎం) పార్టీ నాయకుడు సురేష్ గొండ ఆరోపించారు. శనివారం నాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ప్రభుత్వ పథకాలు  అందకుండా  లబ్ది పొందని వారితో కలిసి ధర్నా,  నిరసన కార్యక్రమం శనివారం నాడు చేపట్టారు. కార్యాలయం సీనీయర్ అసుస్టెంట్ రంజిత్ కూమార్  కు వినతిపత్రం  అందించారు.   ఈ సంధర్భంగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా నాయకుడు సురేష్ గొండ మాట్లాడుతూ.. గృహ జ్యోతి పథకం కొందరికేనా సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా  సీపీఐ(ఎం)పార్టీజిల్లా కమిటీ సభ్యులు,  రాష్ట్ర ప్రభుత్వం పేదవారికిచ్చిన హామీలలో గృహ జ్యోతి అమలులో అధికారుల నిర్లక్ష్యం వలన ఒక జుక్కల్ మండల కేంద్రంలో  300 కుటుంబాలకు ఆన్లైన్ రికార్డులు లేదు అని, దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీలలో గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్ సిలిండర్, బియ్యం కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి రూ.12 వేలు, నేటికీ పూర్తిగా అమలు కాలేదని, నెలలు గడుస్తున్నా..  పేద ప్రజలు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూసే పరిస్థితి దాపురించినది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. ఎస్. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. జుక్కల్ తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ అధికారుల ఒత్తిడి దౌర్జన్యాలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం ఉంచుకొని ఆన్లైన్లో అప్లై చేయక లబ్ధిదారులను వేధించడం సరైనది కాదని అన్నారు. జుక్కల్ మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామంలో ఆన్లైన్ అప్లై లేని వారి పేర్లు లిస్టు తీసుకుని ఆన్లైన్ చేసి జీరో బిల్ వచ్చే విధంగా కృషి చేయాలని విద్యుత్ అధికారులకు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనినియెడల మండలంలోని అన్ని గ్రామాల గృహ జ్యోతి లబ్ధిదారులతో సబ్ స్టేషన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఒక యూనిట్ కి ధర  కంటే అధిక  ధర నిర్ణయించి  బిల్లులు వస్తున్నాయి. కావున డొమెస్టిక్ విద్యుత్ వినగదారులందరికీ  ఒకే ధర  యూనిట్ కి ఇవ్వాలని  కోరారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ నాయకులు షేక్ ఫిర్దోస్ , షేక్ ఫారుక్,  లబ్ధిదారులు, లక్ష్మణ్, గుండు పటేల్, సాయవ్వ, నారాయణ తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు.
Spread the love