కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మైనార్టీ డిక్లరేషన్ అమలు

– పెద్ద మజిద్ మత పెద్ద ను కలిసిన ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి,

– కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి కి ఓటు వేయాలని విజ్ఞప్తి.
నవతెలంగాణ-సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముస్లింల మైనార్టీ డిక్లరేషన్ ను అమలు చేసి తీరుతామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని పెద్ద మజిద్ వద్ద ముఫ్తీ అబ్రార్ మౌలానా ను మర్యాద పూర్వకంగా కలిసి తన తండ్రి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గెలుపుకు మద్దతు కోరారు.అనంతరం ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపు కుల గణన చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో, సంక్షేమ పథకాల్లో మైనారిటీలతో సహా బిసి-సి, బిసి-ఈ లతో పాటు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా మైనారిటీల కోసం బడ్జెట్ రూ.4,000 కోట్లకు పెంపు చేసి బడ్జెట్ నిధుల వినియోగాన్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా మైనారిటీల సబ్ ప్లాన్ ను కాంగ్రెస్ తీసుకొస్తుందని చెప్పారు. నిరుద్యోగ మైనారిటీ యువతకు, మహిళలకు సబ్సిడీ రుణాలను అందించేందుకు ఏటా రూ.1,000 కోట్ల కేటాయింపు చేస్తామని తెలిపారు. అబ్దుల్ కలాం తోఫా-ఎ- తాలిమ్ పథకం ద్వారా పిహెచ్ డి,యం పిల్  పూర్తి చేసిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా  పీజీకి రూ. లక్ష, గ్రాడ్యుయేషనికి రూ. 25,000, ఇంటర్ కు రూ. 15,000, పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు రూ.10,000 చొప్పున కేటాయించడం జరుగుతుందని వివరించారు.హజ్ హౌస్, ఉర్దూ అకాడమీ మొదలైన మైనారిటీ సంస్థల్లో ఖాళీల భర్తీ చేసి ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డి.ఎస్సి వేస్తామని పేర్కొన్నారు.అన్ని మతాల మత పెద్దలతో పాటు ఇమామ్ లు, మ్యూజిన్లు, ఖాదీమ్లు, పాస్టర్లు, గ్రంథిలకు నెలవారీ గౌరవ వేతనం రూ.10,000- 12,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వక్స్ బోర్డ్ భూముల, ఆస్తుల రికార్డులను డిజిటలైజేషన్, ఆక్రమణకు గురైన వక్స్ బోర్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకొని తిరిగి వక్స్ బోర్డు కింద నమోదు చేస్తామని తెలిపారు. ఇళ్లు లేని ముస్లిం, క్రిస్టియన్, సిక్కు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇంటి స్థలం, రూ.5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులలో కొత్తగా పెళ్లయిన జంటలకు రూ.1,60,000 ఇస్తామని చెప్పారు.కావున మైనార్టీలు ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్ రెడ్డి కి ఓటు వేసి  అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.
Spread the love