పొట్టకూటి కోసం తప్పని వలసలు

పొట్టకూటి కోసం తప్పని వలసలు– యూరియా దొరక్క బీజేపీ సర్కార్‌పై మధ్యప్రదేశ్‌ గిరిజన ప్రాంత రైతుల ఆగ్రహం
– గిరిజన ప్రాంతాలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి
– ప్రజలకు రాజకీయ పార్టీలపై పెరుగుతున్న అసహనం
రాజ్‌గఢ్‌ : ”22 ఏండ్ల మహేష్‌ భూరియా రాజ్‌గఢ్‌లోని తన గ్రామమైన చిరోడాకు వచ్చాడు. అతని తమ్ముడు, తల్లి కూడా గుజరాత్‌ నుంచి రావాలనుకున్నారు కానీ ఆర్థిక పరిస్థితులు అంతగా కలిసొచ్చేవి కావు. వీరంతా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో పొలాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ పొలాల్లో పత్తిని ఎక్కువగా పండిస్తారు. వీరంతా ఇంటి వద్దే ఉండి పని చేయడానికి ఇష్టపడరు? కానీ వారికి ఇక్కడ పని దొరకడం లేదు. దీంతో తాము బయటికి వెళ్లి పని చేయాల్సి వస్తుంది ” అని మహేష్‌ భూరియా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక అమాలియా గ్రామంలో చూస్తే.. భిల్‌ గిరిజనుల వలసలు చేదు వాస్తవం. పని లేక గిరిజన సమాజానికి చెందిన వీరు తమ ఇండ్లను విడిచిపెట్టి సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుజరాత్‌లో వ్యవసాయం, కూలీ పనులు చేస్తున్నారు. అమాలియాలోని నంబై కుటుంబం 22 మంది వ్యక్తుల కుటుంబం. ఇక్కడ సంవత్సరంలో చాలా నెలలు నలుగురు మంది సభ్యులు తప్ప ఎవరూ కనిపించరు. ఇంటి పెద్ద , అతని వద్ధ భార్య మినహా మొత్తం కుటుంబం జునాగఢ్‌కు వెళ్తుంది. ఇక్కడే ఉండాలని అందరూ కోరుకుంటున్నా ఉండలేకపోతున్నారు. ఇది ఇక్కడి ప్రతీ కుటుంబం కథ.
రాజ్‌గఢ్‌లోని తిర్లాలోగల మార్కెట్‌లో కిరణ్‌, ఆమె భర్త కిరాణా దుకాణం అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. ఈ దుకాణంలో చిన్నపాటి కుట్టుపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎన్నికల వాతావరణం ఏంటని ప్రశ్నిస్తే.. ఇక్కడ ప్రత్యేక హడావుడి ఏమీ లేదని ఆమె అంటున్నారు. ఇంతకు ముందు మా అకౌంట్‌లో లడ్లీ ఇన్‌స్టాల్‌మెంట్‌ వచ్చిన మాట నిజమే కానీ, ఈసారి ఫోన్‌లో డిపాజిట్‌ చేసిన డబ్బుల మెసేజ్‌ రాలేదు. అని తెలిపాడు.
మరోవైపు, అమాలియా యొక్క మంగళ్‌ ప్రస్తుత ప్రభుత్వ పనితీరుతో ప్రత్యేకంగా సంతోషంగా కనిపించలేదు. లాడ్లీ యోజన సొమ్మును ప్రభుత్వం ప్రజలకు అందజేసిందని, ఎన్నికల తర్వాత అది ఆగిపోతుందన్నారు.
బీజేపీ సర్కార్‌పై రైతుల ఆగ్రహం…
మధ్యప్రదేశ్‌లో ఎరువుల కోసం రైతులు ఆందోళనకు గురవుతూనే ఉన్నారు. ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల వలసలే కాక యూరియా కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. 35 కిలోమీటర్ల దూరం బైక్‌పై వెళ్తూ వద్ధ మగన్‌ ధర్‌ బజార్‌ చేరుకున్నాడు. ” ఇప్పుడు పంటకు ఎరువులు వేసే సమయం వచ్చింది. కానీ ఎక్కడా అందుబాటులో లేవు. ఇంత దూరం వచ్చినా ఎరువులు లేవని సహకార సంఘం నుంచి వెనక్కి పంపుతున్నారు”అని ఆవేదన వ్యక్తం చేశారు. అజ్నారులోని బబ్లూ, గులాబ్‌ కూడా ఇదే మాట చెబుతున్నారు. ”15 రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నాం. పొలం కౌలు జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. ఇంత దూరం నుంచి రావాలంటే రూ.100 ఖర్చు అవుతుంది. ప్రతిరోజూ ఇలాగే ముగుస్తోంది. ఈ రోజు కూడా ఇలాగే ముగిసింది. మళ్లీ రేపు వస్తాను” అని వాపోయాడు.
గిరిజన ప్రాంతాలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి
రాజ్‌గఢ్‌ తహసీల్‌ ఆ గిరిజన ప్రాంతాలకు చెందినది. ఇక్కడ కాంగ్రెస్‌ దృష్టిసారించింది. ప్రియాంకా గాంధీ ఇక్కడ జైన తీర్థయాత్రను సందర్శించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మొహంఖేడా నుంచి గిరిజన ప్రాంతంలోని ఆరు జిల్లాలను కవర్‌ చేసే వ్యూహం ఉన్నట్లు భావిస్తున్నారు.
రాజకీయ పార్టీల నుంచి నిరాశే
ఇక్కడ ఎన్నికల ప్రచారం కూడా భిన్నంగా సాగుతోంది. స్థానిక రూపం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిసిటీ కోసం లౌడ్‌ స్పీకర్లలో ప్లే చేసే పాటలు శ్రావ్యమైన రాగాలు , ఆధునిక రాగాలను కలిగి ఉంటాయి. ప్రచార పాటల్లో పట్టణ ప్రాంతాల కంటే తాజాదనం ఉంటుంది. కానీ మారుమూల గ్రామీణ గిరిజన ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మార్కెట్లలో రాజకీయాలు, ఎన్నికలు, పార్టీల విషయంలో అనిశ్చితి నెలకొంది. నినాదాలు, వాగ్దానాల పట్ల ప్రజలు నిరుత్సాహంగా, అసహనంగా కనిపిస్తున్నారు. అమ్లియాన్‌ గ్రామానికి చెందిన ఓటరు కండ్లు పూర్తిగా నిశ్శబ్దంగా మారుతున్నాయి. అలానే తిర్లలో కార్లు రిపేర్‌ చేసుకునే టీనేజర్లు తమ పనులు చేసుకుంటూ ఏ ప్రభుత్వమొచ్చినా ఏం లాభం అని అంటున్నారు.
ఓటేయాలంటే ఓటేస్తార కానీ ఏ రాజకీయ పార్టీపై ఆశలు లేవు. ఇన్ని సంవత్సరాలుగా ఏ అభివృద్ధి జరగలేదని చెబుతున్నారు.

Spread the love