వైజ్ఞానిక ప్రదర్శనలతో ప్రతిభ మెరుగు

నవతెలంగాణ-ఉప్పునుంతల

చిట్టి బుర్రలకు పదును పెట్టారు. అద్భుతమైన ఆవిష్కరణలు రూపొందించి అబ్బుర పరిచారు. మంగళవారం ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు వివిధ అంశాలపై వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలని ఎంఈఓ చంద్రశేఖర్ కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, భాగ్యరేఖ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Spread the love