
– అసోసియేట్ డీన్ అభినందనలు….
నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర కళాశాల సాంస్కృతిక & సాహిత్య పోటీలలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్ధులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 12 నుండి 14 వరకు సిరిసిల్ల లోని బాబు జగజ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల జరిగాయి. స్థానిక వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట విద్యార్థిని విద్యార్థులు పలు పోటీల్లో పాల్గొని వివిధ బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ పోటీల్లో గెలిచిన వారికి అభినందనలు తెలిపారు. విద్యార్థులు వ్యవసాయ విద్యతో పాటు వివిధ సాంస్కృతిక,సాహిత్య నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు.భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ఎంతో తోడ్పడుతుంది అని చెప్పారు.
బహుమతులు అందుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేసారు. ఈ పోటీల్లో సోలో క్లాసికల్ విభాగంలో నాలుగో సంవత్సరం విద్యార్ధిని ఏఎస్ ఆదిత్య,సోలో ఫోక్ సాంగ్ విభాగంలో నాలుగో సంవత్సరం విద్యార్ధిని ఎం.అఖిల,సమూహం నృత్యం విభాగంలో నాలుగో సంవత్సరం విద్యార్ధిని ఎం.అఖిల,ఏఎస్ ఆదిత్య,నాలుగో సంవత్సరం విద్యార్ధిని ఎం.యామిని,మూడో సంవత్సరం విద్యార్ధులు వై.రీచా,ఈ నాగరాణి,ఎం.జే నీతా ఆనంద్ లు మొదటి ప్రైజ్ లు గెలుపొందారు. ఓ.ఎస్.ఏ డాక్టర్ ఎస్.మధుసూధన్ రెడ్డి,డాక్టర్ టీ.పావని పర్యవేక్షణలో ఇక్కడ విద్యార్ధులు అక్కడ పోటీల్లో పాల్గొని కళాశాలకు వన్నె తెచ్చారు.