అశ్వారావుపేట లోనూ రామ్ సహాయానికే  చేయూత…

– భారీ ఆధిక్యంతో విజయం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అనుకున్నట్లు గానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ అశ్వారావుపేట నియోజక వర్గం ఓటర్లు కాంగ్రెస్ కే చేయూత నిచ్చారు.ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న రామ సహాయం రఘు రామిరెడ్డి కే (ఆర్ ఆర్ ఆర్ – ట్రిపుల్ ఆర్ ) కి భారీ ఆధిక్యత కట్టబెట్టారు.అసెంబ్లీ ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ అభ్యర్ధి నేటి ఎమ్మెల్యే ఆదినారాయణ కంటే అదనంగా 14,018 ఓట్ల ఆధిక్యతను చూపించారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా 4 లక్షల పై చిలుకు ఓట్లతో ఖమ్మం ఎం.పీ గా రామ సహాయం రఘురామిరెడ్డి విజయం సాధించారు. అశ్వారావుపేట నియోజక వర్గంలో మొత్తం 1,59,174 ఓటర్లు ఉండగా గత నెల 13 న జరిగిన పోలింగ్ లో 1,28,848 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మంగళవారం నిర్వహించిన లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్ధి రామ సహాయం రఘురామిరెడ్డి 776,116,బీఆర్ఎస్ అభ్యర్ధి  నామనాగేశ్వరరావు 33,189,భాజపా అభ్యర్ధి తాండ్ర వినోద్ 9,283 ఓట్లు పొందారు.ట్రిపుల్ ఆర్ కు 42,927 ఓట్లు ఆధిక్యం లో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో..
గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,55,961 ఓటర్లు ఉండగా 1,35,501 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాటి అభ్యర్ధి,నేడు ఎమ్మెల్యే అయిన జారే ఆదినారాయణ కు 74,993,బీఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు 46,088,సీపీఐ(ఎం) అభ్యర్ధి,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ రావు కు 2,488 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణ కంటే ఎం.పి రామ సహాయం రఘురామిరెడ్డి కి 14,018 అదనంగా ఆధిక్యం లభించింది.
పార్లమెంట్ ఎన్నికలు – 2024
ఖమ్మం పార్లమెంట్ –     17
అశ్వారావుపేట నియోజక వర్గం – 118
మొత్తం ఓటర్లు        1,59,174
పోలైన ఓట్లు            1,28,848
కాంగ్రెస్                       76,116
బీఆర్ఎస్                   33,189
భాజపా                        9,283
ఆధిక్యం                     42,927
అసెంబ్లీ ఎన్నికలు – 2023:
మొత్తం ఓటర్లు         1,55,961
పోలైన ఓట్లు            1,35,501
కాంగ్రెస్                       74,993
బీఆర్ఎస్                    46,088
భాజపా                          2488
ఆధిక్యం                      28,905
Spread the love