పాలకుర్తిలో కాంగ్రెస్ విజయ దుందుభి మోగిస్తాం..

– నియోజకవర్గ నాయకురాలు ఝాన్సీ రెడ్డి 
– ప్రజా సేవ కోసమే రాజకీయ క్షేత్రంలోకి 
– కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నవతెలంగాణ- పెద్దవంగర:
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ విజయ దుందుభి మోగిస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నవంగర, చిట్యాల, బొమ్మకల్లు గ్రామాల్లో గడపగడపకు కాంగ్రెస్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. అంతకుముందు గ్రామాల్లో ఝాన్సీ రెడ్డి కి కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున డప్పు చప్పుల్లు, కోలాటాలు, బతుకమ్మ లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించి, మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తోనే అభివృద్ధి సాధ్యం అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం కోసమే అమెరికా లోని విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు. తొర్రూరు ప్రాంత ఆడబిడ్డను, ఎన్నికల్లో ఆదరిస్తే నిజమైన అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఎమ్మెల్యే గా వచ్చే జీతం మొత్తాన్ని ప్రజల సంక్షేమమే కోసమే కేటాయిస్తానని స్పష్టం చేశారు. 45 రోజులు కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఐదేళ్లు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, చిన్నవంగర ఎంపీటీసీ సభ్యులు మెట్టు సౌజన్య నగేష్, రెడ్డికుంట తండా సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, జిల్లా జాయింట్ సెక్రెటరీ ముత్యాల పూర్ణ చందర్, మండల ఉపాధ్యక్షుడు రంగు మురళి, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, మండల సీనియర్ నాయకులు తోటకూరి శ్రీవివాస్, యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, పన్నీరు వేణు, మండల ప్రధాన కార్యదర్శి ఓరుగంటి సతీష్, ఆవుల మహేష్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పబ్బతి సంతోష్ యాదవ్, రామ్ రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సీతారాం నాయక్,  శ్యామ్, ఉపేందర్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, తండ గ్రామానికి చెందిన నిఖిల్, సుమన్, రక్షన్, హరీష్, యసరపు రవి, రమేష్, భూపాల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love