పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు పెంచాలి

నవతెలంగాణ – రాయపర్తి
పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు పెంచేలా కార్యకర్తలు పాటుపడాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగేలా పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేశాయని భావించకుండా రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపించాలన్నారు. తాము ప్రజల్లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు మేలు జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. తాము అభివృద్ది, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు అన్నారు. ప్రజల శ్రేయస్సునే బీఆర్ఎస్ కోరుకుంటుందని చెప్పారు. కార్యకర్తలు ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ స్పూర్తిని చూపెట్టాలి అన్నారు.
వధూవరులను ఆశీర్వదించిన ఎర్రబెల్లి
కొత్తూరు గ్రామ మాజీ సర్పంచ్ కందికట్ల స్వామి కూతురు, తీర్మాలాయపల్లి గ్రామనికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు దొంతరాబోయిన అంజయ్య కూతురు, ఊకల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పొలాస యాకయ్య కూతురు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఎన్నికల ఇంచార్జి గుడిపూడి గోపాల్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహా నాయక్, ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, జిల్లా పార్టీ నాయకుడు బిల్లా సుధీర్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ జక్కుల వెంకట్ రెడ్డి,  పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఎండీ నయీమ్, బీసీ సెల్ అధ్యక్షుడు చెవ్వు కాశీనాథం, యూత్ అధ్యక్షుడు ముత్తడి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love